
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో తన పర్యటనను రెండవ రోజు కొనసాగిస్తుంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బీర్కూర్ లో నేడు రేషన్ షాప్ ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలాసీతారామన్ రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు.
Read Also : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
దానికి కలెక్టర్ తనకు తెలియదని సమాధానం చెప్పడంతో, కలెక్టర్ అయి ఉండి తెలియదంటారా అంటూ నిర్మల సీతారామన్ కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. అర గంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్ ను ఆదేశించారు. రెండో రోజు పర్యటనలో అడుగడుగునా నిర్మలా సీతారామన్ కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంతో తెలియకుండా ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్ అయ్యుండి మీరు తెలుసుకోకుండా ఎలా ఉన్నారు అంటూ నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. అరగంట టైం ఇస్తాను తెలుసుకొని చెప్పమని కలెక్టర్ కు చెప్పిన మంత్రి నిర్మల సీతారామన్, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయలు ఖర్చవుతుందని, కేంద్ర ప్రభుత్వం అందులో 30 రూపాయలు భరిస్తుందని తెలిపారు.
Also Read : కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
ఇక రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్రమంత్రి ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని మరోమారు కలెక్టర్ ను నిలదీశారు. ప్రధాని మోడీ ఫోటో మీరు పెట్టకపోతే తానే స్వయంగా వచ్చి ప్రధాని మోడీ ఫోటోలను రేషన్ షాపుల్లో పెట్టి వెళతాను అంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. ఆపై కోటగిరి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారుపై, కెసిఆర్ పాలనపై నిప్పులు చెరుగుతున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా జిల్లా కలెక్టర్ ను టార్గెట్ చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. నిర్మల సీతారామన్ పర్యటన ముగిసేసరికి ఆమె మరెంతగా ప్రభుత్వంపై విరుచుకు పడతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
- తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..