
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. దాంతో ఇవాళ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యాశాలను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు నిపుణులతో కూడిన బృందం పరిశీలించారు.
Also Read : కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
హాస్పిటల్‌ను పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆపరేషన్లు చేసి గది, పరికరాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని 30 మంది వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. గత నెల 25వ తేదీన జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి ఆరా తీశారు. అయితే, ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళల మృతికి స్టెఫిలో కోకస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియానే కారణమని ప్రాథమిక నివేదికలో తేలింది. డీపీఎల్ సర్జరీల కోసం వాడిన ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్‌మెంట్ స్టెరిలైజ్ చేయకపోవడంతోనే ఈ బ్యాక్టీరియా సోకి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
మరణించిన నలుగురు మహిళలతో పాటు మరో 25 మంది కూడా బ్యాక్టీరియా బారినపడినట్లు తెలుస్తోంది. కొంత మందికి ల్యాప్రోస్కోపిక్ హోల్, రింగ్స్ చుట్టూ చీము రావడంతో నిమ్స్, అపోలో వైద్యులు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. హాస్పిటల్‌లో ఉన్న 30 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకోగా.. మిగతా వారు ఇంకా ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లోనే అందర్నీ డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
- అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు- ఎస్ఐ సైదా బాబా
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..
- మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….