
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నిక కాకా రేపుతోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. అన్ని పార్టీలు అక్కడ వాలిపోయాయి. ఈ ఉపఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును మళ్లీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. అధికార పార్టీ సత్తా ఏంటో చాటాలని టీఆర్ఎస్.. మునుగోడుని గెలిచి తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలని బీజేపీ.. ఎవరికి వారు.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని స్కెచ్‌ల మీద స్కెచ్‌లు వేస్తున్నారు. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకున్నా.. ఎప్పడు వస్తుందన్న క్లారిటీ లేకున్నా.. పార్టీలన్నీ మునుగోడు చుట్టూనే తిరుగుతున్నాయి.
Read Also : నేటి నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం…
ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలతో ఇప్పటి నుంచే నేతలంతా మునుగోడులో మకాం వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే ఒక్కొ బహిరంగ సభను నిర్వహించారు. ఐతే త్వరలోనే మరో సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మునుగోడుపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేసింది. ఈ క్రమంలో మునుగోడులో కాషాయ దళం దూకుడు పెంచింది. మునుగోడు ఉపఎన్నిక ఇన్చార్జిగా మాజీ ఎంపీ వివేక్‌కు బాధ్యతలు అప్పగించింది. పార్టీ శ్రేణులు, అభ్యర్థి సమన్వయకర్తగా మనోహర్ రెడ్డిని నియమించింది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు తరుణ్ చుగ్, బండి సంజయ్ మునుగోడులోనే బస చేయనున్నారు.
Also Read : గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలని స్థానిక నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు. అంతేకాదు ఈ నెలాఖరులోనే మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. రెండో బహిరంగ సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇవాళ్టి నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 3వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపలో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రచారం చేయనున్నారు.
Read Also : టిఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి… మునుగోడులో మావోల లేఖ కలకలం
మన మునుగోడు – మన కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారంలోకి వెళ్లబోతోంది. ఈ నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక నాయకులను కలుపుకొని జనంలోకి వెళ్లాలని.. బిజేపి, టీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే బిజేపిలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ తెలిపింది. మండలాలు, పంచాయతీల వారీగా బిజేపి, టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి :
- చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి మహ్ముద్ అలీ
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…