
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా టిఆర్‌ఎస్, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తూ తమతో కలసి వచ్చే ఇతర పార్టీల మద్దతు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సిపిఐ పార్టీ తరహాలోనే ఉప ఎన్నికలో తమ మద్దతు టిఆర్‌ఎస్ పార్టీకేనని సిపిఎం ప్రకటించింది. ఈమేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం కీలక ప్రకటన చేశారు. బిజేపి పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని అందుకే టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
Read Also : మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే తాము టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో మునుగోడులో టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Also Read : నేటి నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం…
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయని తమ్మినేని వీరభద్రం జోస్యం చెప్పారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అయితే టీఆర్ఎస్‌కి మద్దతు మునుగోడు ఉపఎన్నిక వరకే ఉంటుందని.. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కోరాయని, బీజేపీని ఓడించేందుకు తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తమ్మినేని స్పష్టం చేశారు. ఇప్పటికే సీపీఐ టీఆర్ఎస్‌కి మద్దతు ప్రకటించగా… తాజాగా సీపీఎం కూడా కారుకే జై కొట్టడంతో మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
- టిఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి… మునుగోడులో మావోల లేఖ కలకలం
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
- కమలం”జోరు”…. కాలీకానున్న కారు.