
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చైనా జవాన్లతో జరిగిన పోరాటంలో గల్వాన్ లోయలో అమరులైన బిహర్ సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్‌లో పర్యటించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి గల్వాన్ లోయలో మరణించిన ఐదుగురు బిహర్ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు తదితర జాతీయ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల నడుమ చర్చలు జరిగాయి.
Also Read : మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదు. కానీ బిహార్ రాష్ట్రం పాట్నాకు వెళ్లి రాజకీయాలు చేసే టైం ఉందా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పేదల ప్రాణాల కంటే ముఖ్యమంత్రికి రాజకీయాలే ముఖ్యమా అని నిలదీశారు. పేద కుటుంబాలను పరామర్శించకుండా.. రాజకీయాల కోసం పట్నా వెళ్లడాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ఏ విధంగా సమర్దించుకుంటారని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం తో పాటు వారి పిల్లలకు పూర్తి విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also : మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మిగతా 30మంది మహిళలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. పేదలు ఎక్కువ ఉండే ఇబ్రహీంపట్నం లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే వాటిని ఆపి సివిల్ సర్జన్లను నియమించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అందుబాటులో వైద్యులు ఉంటే ఇంత ఘోరం జరగకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- నేటి నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం…
- గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
- టిఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి… మునుగోడులో మావోల లేఖ కలకలం
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు