
క్రైమ్ మిర్రర్, మహదేవ్ పూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల పేరుతో వెలువడుతున్న లేఖలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. వారం క్రితం అధికార పార్టీకి చెందిన కొంతమంది భూకబ్జాలకు,అక్రమాలకు పాల్పడుతున్నారని ఏటూరునాగారం- మహాదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి ‘సబితా’ పేరుతో మావోయిస్టులు లేఖా విడుదల చేయగా, తాజాగా పోలీసు ఇన్ఫార్మర్లే టార్గెట్ గా మహబూబాబాద్, వరంగల్-2, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి “వెంకటేష్” పేరు తో మరో లేఖ విడుదల చేశారు.
Read Also : ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..
అలజడి సృష్టిస్తున్న మావోల లేఖ.. : 2022 వరకు విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే పథకంలో భాగంగా బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు ముఠా ఇన్ ఫార్మర్ నెట్ వర్క్ ను పెంచి పోషిస్తుందన్నారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ప్రమోషన్లకు, రివార్డులకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుల సెక్షన్ తో లాంపెన్ యువతతో, వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకొని సమాచారం మాకు డబ్బులు మీకు అని ప్రచారం చేస్తు వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా మార్చుకుంటున్నారని ఆరోపించారు, పోలీసుల ప్రోత్బలంతో కొంతమంది వ్యాపారస్తులు ప్రజలపై విపరీతమైన దోపిడీ చేస్తున్నారని, కిరాణంలో వంట సరుకులు ఎక్కువగా తీసుకున్న, కొత్త వ్యక్తులు కనబడ్డ వెంటనే సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారని ఆరోపించారు.
Also Read : దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
సీసీ కెమెరాల వినియోగంపై ఆగ్రహం.. : జయశంకర్ జిల్లా లోని అటవీ గ్రామాలతో పాటు మండల ప్రధాన కూడళ్లలో వ్యాపారస్తుల రక్షణ పేరుతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బీజేపీ నాయకులు నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ల ముఠా రాష్ట్రంలో ఇన్ఫార్మర్లను పెంచి పోషిస్తున్నారని, కొంతమంది అధికార పార్టీ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు చేస్తున్న దోపిడిని ఎదిరిస్తున్న ప్రజలపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని లేఖలో ఆరోపించారు.. నీలంపల్లి, ముకునూరు, బూరుగూడెం , తుపాకులగూడెం మొదలైన గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసు ఇన్ ఫార్మర్లు నిఘా పెట్టి మావోయిస్టుల కదలికల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని అధికార పార్టీ నాయకులు, ఇన్ ఫార్మర్లు తమ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖల ద్వారా హెచ్చరిస్తున్నారు.
Read Also : అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు- ఎస్ఐ సైదా బాబా.
అప్రమత్తమైన పోలీసులు..క్షుణ్ణంగా తనిఖీలు : మావోయిస్టు ల పేరుతో విడుదలవుతున్న లేఖలతో పచ్చని గ్రామాల్లో ఎప్పుడూ ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తానికి ఈ లేఖలతో అలర్ట్ అయిన భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీసులు కొంత మంది మోస్ట్ వాంటెడ్ మావోల పోటోలను విడుదల చేసి సమాచారం మాకు బహుమతి మీకు అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. అంతే కాకుండా మావోల టార్గెట్ లో ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతూ,ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూన్నారు, మరియూ వాహన తనికీల్లో తారకపడిన అనుమానిత వ్యక్తుల పేర్లు, వివరాలు నమోదు చేసుకొని వదిలేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….
- మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…
- నేటి నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం…
- టిఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి… మునుగోడులో మావోల లేఖ కలకలం
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
One Comment