
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో బైపోల్ షెడ్యూల్ రానుందనే వార్తలతో అన్ని పార్టీలు మునుగోడులో ప్రచారం చేస్తున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక రాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని కామెంట్ చేయడం హాట్ హాట్ గా మారింది.
నిజానికి కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని… ముందస్తుకు వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని … పీకే టీమ్ కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చిందట. ఎంత త్వరగా అసెంబ్లీని రద్దు చేస్తే అంత మంచిదని సూచించిందట. దీంతో కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అలా అయితేనే విపక్షాలపై పైచేయి సాధించగలమని.. వారు కుదురుకునే లోగా ఎన్నికల బరిలో దూకితే ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయని అనుకుంటున్నారట. ఓ వైపు బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో ప్రజలకు దగ్గరవుతుంటే.. మరో వైపు రేవంత్‌రెడ్డి కూడా దూకుడు పెంచారు. ఇక బీజేపీ .. కేసీఆర్ కుటుంబ అవినీతిపై గట్టిగా ఫోకస్ చేసింది.
ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడం సంచలనం సృష్టించింది. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో పాటు బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే తనకు బ్యాడ్‌టైమ్ తప్పదని భావిస్తున్నారట కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పూర్తిస్థాయిలో కదనరంగంలోకి దూకకముందే అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఏడాది మార్చి, ఎప్రిల్‌లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట. పీకే టీమ్ కూడా ముందస్తే మంచిదని సలహా ఇవ్వడంతో కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ ఇంకా పూర్తికాలేదు.అసెంబ్లీ రద్దుచేసేముందే సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారట. దసరా నాటికి పూర్తిస్థాయిలో సెక్రటేరియట్ నిర్మాణం పూర్తికాకుకన్నా.. కనీసం సీఎం ఛాంబర్ ఉన్న ఆరోఫ్లోరైనా కంప్లీట్ చేసి అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేయాలని కేసీఆర్ ఆలోచనగా ఉందట. అందుకు తగ్గట్లే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారట కేసీఆర్. సీఎం ఆఫీస్ ఉండే ఆరోఫ్లోర్‌ను ముందు ప్రారంభిస్తే కేసీఆర్ అనుకున్న మంచి జరుగుతుందని… సిద్ధాంతులు కూడా కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. దసరా నాటికి సెక్రటేరియట్‌లో సీఎం ఛాంబర్ ప్రారంభించి.. కొన్నాళ్లు అక్కడ కార్యకలాపాలు నిర్వహించి డిసెంబర్ తర్వాత అసెంబ్లీ రద్దు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. మునుగోడు బై ఎలక్షన్ కూడా డిసెంబర్ లోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
అక్కడ ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని ఇంటలిజెన్స్ వర్గాలు కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చాయట. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని భయపడుతున్న కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లకుండా డైరెక్టుగా ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని గులాబీబాస్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
- అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు- ఎస్ఐ సైదా బాబా.
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…
- మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….
- మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…