
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్: మునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట.. ఆ లేఖ ఉంది. అధికారం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి బీజేపీ అవసరమైందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లంచగొండి, కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందని.. మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read : నేడు పెద్దపల్లిలో కేసిఆర్ పర్యటన… పెద్దకల్వలో భహిరంగసభ
పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం.. దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలపైనా నిఘా పెట్టారు. ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి? క్యాసినో కేసు నుంచి బయటపడేందుకేనా?
అడెల్లు అలియాస్ భాస్కర్ సారథ్యంలోని మావోయిస్టుల బృందం.. ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో తిరుగుతున్నట్లు కొందరు పోలీసులు చెబుతున్నారు. దీంతో అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే గ్రామాల ప్రజలు.. మావోయిస్టులకు భయపడి వారికి ఆశ్రమం కల్పించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ నియామకాల వివాదంపైనా.. మావోయిస్టులు ఘాటుగా స్పందించారు.
బాధితులు దళారుల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నారని.. ఆందోళన చేసిన సమయంలో బాధితులకు అప్పుపత్రాలు, భూమి పత్రాలు రాసి ఇచ్చిన దళారులు.. డబ్బులు మాత్రం చేతికి ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపైనా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో.. తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో గది! పరిశీలించనున్న కాంగ్రెస్ బృందం…
- రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నిలబడుతుందా? లాయర్లు ఏం చెబుతున్నారు?
- చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి మహ్ముద్ అలీ
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???