
పెద్దపల్లి బహిరంగ సభలో మరోసారి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. వీరికేనా మనం రాజ్యాధికారం ఇచ్చేది అంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీతోపాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కేసీఆర్ టార్గెట్ చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ దిశగా మనమంతా సన్నద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీని పారద్రోలి రైతుల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులంతా కోరారని.. మీటర్లు పెట్టే బీజేపీని ప్రారదోలాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారని.. నా వెంట ఉంటానన్నారని.. మీటర్లు పెట్టే బీజేపీపై పోరాటం చేద్దామన్నారని కేసీఆర్ అన్నారు.
దేశంలోని రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్ కేవలం 20.08 శాతం మాత్రమేనని.. ఈ విద్యుత్ కు కేవలం 1.45 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే బీజేపీకి రైతులు బుద్ది చెప్పాలని కేసీఆర్ కోరారు. ఒక కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కూడా కాదని.. రైతుల విద్యుత్ కోసం మోడీ ఖర్చు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
రైతులకు వ్యవసాయ మోటార్లకు ఎందుకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే.. మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని పోరాటం చేయాలని రైతు సంఘాల రెడీ కావాలని.. మోడీకే 2024 ఎన్నికల్లో మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.