
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేపట్టాలని వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. యాత్రలో భాగంగా నేడు బండి సంజయ్ వరంగల్ లోని భద్రకాళీ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం హన్మకొండలో నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ముగింపు సభలో పాల్గొననున్నారు.
Read Also : మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
ఈముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.జేపీ నడ్డా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాల తో సమావేశం నిర్వహిస్తారు. ఆపై 4 గంటల 10 నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర కొత్త ఇన్చార్జి సునీల్ బన్సల్ తో పాటు బిజెపి ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈ సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం తో, బిజెపి సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోర్టును ఆశ్రయించి మరీ ఈ సభకు అనుమతి పొందింది.
Also Read : మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
ఈ క్రమంలో ఈరోజు హనుమకొండ వేదికగా నిర్వహించే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆంక్షలు, అరెస్టులు, అనుమతుల గందరగోళం మధ్య హైకోర్టు అనుమతితో నిర్వహించనున్న నేటి సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. మునుగోడు ఉపఎన్నిక, రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఇక లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తున్న వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సమయంలో వరంగల్ వేదికగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో, సభను సక్సెస్ చేయడం కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు.
Read Also : కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా…..
కాకతీయ కళా తోరణం తో సభా వేదికను ముస్తాబు చేశారు. వేదిక పైన 150 మంది కూర్చునే లాగా వేదికను సిద్ధం చేశారు. కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నుండి సీఎం కేసీఆర్ పై జేపీ నడ్డా, బండి సంజయ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే హోంమంత్రి అమిత్ షా మునుగోడు సభలో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేసినట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….
- సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…