
క్రైమ్ మిర్రర్, శామీర్ పేట్ : తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు హకీంపేట్ బస్టాప్ దగ్గర మురికి కాలువను పరిశీలించారు. ఎలిఫెంట్ రెస్టారెంట్ నిర్వాహకులు మురికి కాలువను రహదారి పక్కన వదిలి వేయడం వల్ల దుర్వాసనతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దగ్గరలోనే బస్ స్టాప్ ఉండడం వల్ల ప్రయాణికులు నిలబడలేని పరిస్థితి ఉన్నదని, తరచూ ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రహదారి ద్వారానే వెళుతూ ఉంటారు. తూంకుంట మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, అధికారులు గాని పట్టించుకోవడం లేదు.
Read Also : ముగిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర… పాల్గొన్న సునిల్ బన్సాల్
మున్సిపాలిటీ అధికారులు ప్రజల దగ్గర పన్నులు (టాక్స్ లు)సమయానికి వసూలు చేస్తున్నారు కానీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి మురికి కాలువకు శాశ్వత పరిష్కారం చేయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల తూంకుంట మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Also Read : చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి మహ్ముద్ అలీ
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాలరాజ్,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్, మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శేశాంత్ (బన్నీ),హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- 49వ సిజెఐగా యూయూ లలిత్ ప్రమాణస్వీకారణ….
- హన్మకొండలో బిజేపి బహిరంగసభ నేడు… హాజరుకానున్న జెపి నడ్డా
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
- జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….