
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కు మోక్షం లభించింది. 674 మీటర్ల పొడవు 45.29 కోట్ల రూపాయలతో నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ను ఈరోజు హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గత మంగళవారమే ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించాల్సి ఉండగా బీజేపీ నాయకుల అరెస్టులతో, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది.
Read Also : 49వ సిజెఐగా యూయూ లలిత్ ప్రమాణస్వీకారణ….
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో చెలరేగిన నిరసనల కారణంగా, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇంటి పై జరిగిన దాడికి కొనసాగింపుగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అప్పుడు జరగాల్సిన ప్రారంభోత్సవం ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా పడింది. మంత్రి కేటీఆర్ స్వయంగా తన పర్యటనను వాయిదా వేశారు. ఎట్టకేలకు చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈరోజు హోం మంత్రి మహమూద్ అలీ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వరంగల్, విజయవాడ హైవే మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సమయం ఆదా అవుతుందని, కొంత మేర ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని తెలుస్తుంది.
Also Read : హన్మకొండలో బిజేపి బహిరంగసభ నేడు… హాజరుకానున్న జెపి నడ్డా
ఈ ఫ్లైఓవర్ వల్ల స్థానిక ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాజెక్టు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ఫ్లైఓవర్ పొడవును 500 మీటర్లు పెంచారు. ఆరామ్‌గఢ్ నుండి సంతోష్‌నగర్ మరియు ఎల్‌బి నగర్‌లను కలుపుతూ హైదరాబాద్ లోపలి రింగ్‌లో ఫ్లైఓవర్ ఉంది. ఇది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్‌బి నగర్ మీదుగా నల్గొండ మరియు వరంగల్‌లకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. కందికల్ గేట్ మరియు బార్కాస్ జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా, ఆగకుండా ట్రాఫిక్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదుగా నేరుగా వెళ్లవచ్చు. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌కు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ 2018లో ఆమోదం తెలిపి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కారణంగా ఇది ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్ ను ఎట్టకేలకు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి :
- మావోయిస్టుల ఉనికికి కారణం పోలీసులే… దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు
- జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
-