
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్ర టెన్షన్ కొనసాగుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను తెలంగాణ ప్రభుత్వం సవాల్ గా తీసుకుంది. బండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ప్రజా సంగ్రామ యాత్రకు నిన్న సింగిల్ జడ్జి అనుమతిని ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా…..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఆపాలని హైకోర్టులో అప్పీల్ చేసిన ప్రభుత్వం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పీల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ పై ఇక ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం విచారిస్తుంది. విచారణ నేపధ్యంలో ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also : జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….
బండి సంజయ్ పాదయాత్ర లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఇక ఈ నెల 23న పోలీసులు ఇచ్చిన నోటీసులను నిరసిస్తూ బిజెపి నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం పాదయాత్ర కొనసాగింపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగని తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వులపై కోర్టు మెట్లు ఎక్కి, బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తోంది.
Read Also : ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
తెలంగాణ సీజే ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్రను మరోమారు నిలిపివేయాలని కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో కోర్టులో విచారణ పై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఆరునూరైనా పాదయాత్ర కొనసాగించి తీరుతామని, వరంగల్లో సభ నిర్వహించి తీరుతామని బీజేపీ శ్రేణులు తేల్చి చెప్పి కోర్టు మెట్లు ఎక్కారు. పాదయాత్రకు అనుమతి తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు సభ నిర్వహణకు కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….