
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లో జరిగిన 45 కోట్ల కుంభకోణాన్ని ఖండిస్తూ రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వాక్యాలు చేశారు. పేదలకు కష్టాలు వస్తే పోలీసులను సంప్రదిస్తారని, పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేనో లేక స్థానిక లీడర్ల దగ్గరకు పోయిన ప్రయోజనం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారందరికీ తీన్మార్ మల్లన్ననే అండగా ఉంటున్నారని తెలిపారు. RFCL తరుపున రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ కు మావోయిస్టులు రాసిన లేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???
మావోయిస్టులు వారి ఉనికిని చాటుకోవడానికి కారణం ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో పోలీసులే కారణమని ఆయన అన్నారు. పోలీసులను సంప్రదించిన పేదలకు న్యాయం జరిగితే ఈనాడు మావోయిస్టుల ప్రస్తావన ఉండేదే కాదన్నారు. రామగుండం లో ఎమ్మెల్యే అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒక్కొక్కరి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన విషయాన్ని గోనె ప్రకాష్ రావు బట్టబయలు చేశారన్నారు. అయితే డబ్బుల వసూళ్లకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు చేపడుతూ అలాగే బాధితులకు డబ్బులు వాపసు ఇప్పియాలని బాధితులు తిన్మార్ మల్లన్నను సంప్రదించగా మల్లన్న రామగుండ ప్రజలకు అండగా నిలవడానికి రాగా మల్లన్న అరెస్టు చేయడం జరిగిందని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రజలను మభ్యపెట్టి మళ్లీ తన అనుచరులతోనే సవాలు విసిరారని తెలిపారు.
Also Read : సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో సోమవారం నుండి బాధితుల తరఫున న్యాయపోరాటం చేయడానికి తీన్మార్ మల్లన్న టీం సిద్ధమవుతున్నామని ఈ విషయంలో వారిపైనా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వబోతున్నామని, ఒకవేళ పోలీసులు ఈ విషయంలో వారిపై కేసులు రిజిస్టర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే దోషుల మీద కోర్ట్ నుండి రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటె తన మీద పెట్టిన కేసులను తీసేస్తానని మంత్రి హరీష్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట ఇస్తేనే అప్పటి ప్రతికూల పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో జాయిన్ అవడం జరిగింది.
కానీ ఇంతవరకు కేసులు తీసేయలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తీసేయమని నేను అడగబోనని, అది వాళ్ల విజ్ఞతకే నేను వదిలేస్తున్నానని మళ్లీ తీన్మార్ మల్లన్న తోనే ప్రయాణం చేస్తామని ఇదే ప్రజా ప్రభుత్వం కోసం మేము ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో మల్లన్న టీమ్ రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య, కరీంనగర్ జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా, జిల్లా టీమ్ సభ్యులు, నియోజకవర్గాల టీమ్ సబ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా…..
- జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….
- ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?