
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడుతూ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ కెసిఆర్ కుటుంబ సభ్యులకు లిక్కర్ స్కామ్ కాదు చాలా స్కామ్ లలో వాటాలున్నాయి అని జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ పై, కవిత, కేటీఆర్ లపై నిన్న బీజేపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యల పై మండిపడుతూ టాలీవుడ్ నిర్మాత, యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత బండ్లగణేష్ అన్ని పార్టీలు తిరిగి ఆదర్శ దంపతులు జీవిత రాజశేఖర్ అంటూ చురకలంటించారు.
Read Also : మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
లక్ష్మీ పార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మరిచిపోయినట్టున్నారు అంటూ సెటైర్లు వేసిన బండ్ల గణేష్ మన రాష్ట్రంలో ఎన్ని పార్టీ జెండాలు ఉన్నాయో, అన్ని జెండాలను మెడలో వేసుకున్నారు అంటూ ఆదర్శ దంపతులు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇక పార్టీలు తిరిగిన మీరు సిపిఐ సిపిఎం పార్టీ లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్క అంటూ ఓ రేంజ్ లో జీవిత రాజశేఖర్ పై సెటైర్లు వేశారు బండ్లగణేష్. అంతేకాదు గతంలో జీవిత రాజశేఖర్ ఏ ఏ పార్టీలో చేరారో ఆ పార్టీలలో చేరినప్పటి ఫొటోలను కూడా బండ్ల గణేష్ షేర్ చేసి జీవితా రాజశేఖర్ రోజుకో పార్టీ మార్చే నాయకురాలని, ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
Also Read : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
ఇదిలా ఉంటే నిన్న టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసిన జీవిత రాజశేఖర్ ఢిల్లీలో ఎక్సైజ్ కుంభకోణంపై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎమ్మెల్సీ కవిత తప్పు చేయలేదు అన్నప్పుడు, నిజం మాట్లాడే ధైర్యం కూడా కేసీఆర్ కు ఉండాలని జీవిత రాజశేఖర్ స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిర్బంధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన జీవిత రాజశేఖర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎవరైనా వేలెత్తి చూపితే, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు చేస్తున్నారంటూ జీవిత-రాజశేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టుగా పోలీసుల చేత బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చాలా స్కాములలో కెసిఆర్ కుటుంబం పాత్ర ఉందని, కేటీఆర్ పాత్ర ఉందని జీవిత రాజశేఖర్ ఆరోపణలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి :
- ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
- ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!