
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఇవ్వాళ ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. తన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, ప్రధాన అనుచరుడిని జమ్మూ కాశ్మీర్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో ఇక ఆజాద్ పార్టీకి పూర్తిస్థాయిలో దూరమౌతారనే ప్రచారం కూడా సాగింది.
Read Also : ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
దీన్ని నిజం చేశారాయన. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ స్థానానికి రాజీనామా చేయడంతోనే తన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేశారు. అప్పటి నుంచీ ఆయన పార్టీ అధిష్ఠానానికి అందుబాటులో లేకుండా పోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడిగా గులాం నబీ ఆజాద్‌కు పేరుంది. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలో మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆజాద్.. ఉప రాష్ట్రపతితో భేటీ కావడాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోన్నారు విశ్లేషకులు. ఆజాద్‌ను గవర్నర్ పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన రెండో రోజే ఆజాద్ ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలుసుకున్నారు. అది మర్యాదపూరక భేటీ మాత్రమే. రాజకీయ ప్రాధాన్యత లేదనే ప్రచారం సాగింది అప్పట్లో. అయినప్పటికీ ఆ ఊహాగానాలకూ తావిచ్చినట్టయింది.
Also Read : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
కాంగ్రెస్‌కు వీడొచ్చనే ప్రచారానికీ ఇది కేంద్రబిందువయింది. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఈ ఊహాగానాలు, ప్రచారాలను నిజం చేసినట్టయింది. గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణకు గవర్నర్‌గా పంపించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరికి ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమెను పూర్తిస్థాయిలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అపాయింట్ చేసి.. గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఇదివరకే తమిళిసై సౌందరరాజన్ భేటీ కూడా అయ్యారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ, అక్కడి రాజకీయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన, గట్టిపట్టు ఉన్న ఆజాద్‌ను గవర్నర్‌గా నియమించితే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం భావిస్తోందని, దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గులాం నబీ ఆజాద్ రూపంలో బీజేపీ ప్రయోగించే కొత్త అస్త్రం ఇదేననే ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
- జీవితరాజశేఖర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన బండ్ల గణేశ్….
- మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….