
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇవాళ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు, పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను నిన్న రాత్రి ఏడు గంటలకే మూసేయించారు. పోలీసులు గస్తీ వాహనాలతో పహారా కాస్తున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు ఎవ్వరినీ అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చార్మినార్ నాలుగు దిక్కులా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Read Also : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
ఎంఐఎం డిమాండ్ మేరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పిడీ యాక్ట్ పెట్టడంతో పాటు, రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. జుమ్మా సందర్బంగా చేసే నమాజ్‌ను శాంతియుతంగా చేసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం సోదరులకు సూచించారు. నమాజ్ తర్వాత అందరూ ప్రశాంతంగా వెళ్లిపోవాలన్నారు. ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఘటనలకు పాల్పడినా.. హైదరాబాద్ పేరు చెడిపోతుందన్నారు.భాగ్యనగరంలో అల్లర్లు సృష్టిస్తున్న మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. విశ్వహిందూ పరిషత్ కోరింది.
Also Read : ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి పాతనగరం పరిస్థితిని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందసభ్యులు వివరించారు. అధికార దాహం కోసమే తెలంగాణ సర్కార్.. హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ హిందుత్వంపై విషం చిమ్మే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమైందని ఆరోపించారు. మునావర్ ఫరూక్ అనే హిందూ ద్రోహిని ప్రోత్సహిస్తూ.. ఇటీవల అతడి కామెడీ షోకు పోలీసులు అనుమతి ఇచ్చి హిందువులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి.. భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్… రేపటి నుండి యాత్ర ప్రారంభం
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…