
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. శుక్రవారం పదవీ విరమణ చేయబోతోన్నారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అయన కంటే ముందు సీజేఐగా పని చేసిన శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థలో మౌళిక వసతుల కల్పన కోసం చాలా కృషి చేశారు.
Also Read : నేడు మండల్ 104 జయంతి… బీసీలకు రిజర్వేషన్లను అందించిన ఘనత మండల్ దే
జమ్ముకాశ్మీర్ లో 310 కోట్ల రూపాయలతో నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్తపాన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లా కోర్టులను ప్రారంబించారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరంలో 100 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త కోర్టు సముదాయన్ని ఆయన ప్రారంభించారు. జర్కండ్ రాష్ట్రంలోని రెండు జిల్లాలో సబ్ డివిజన్ కోర్టులను ఆయన ప్రారంభించారు. జస్టీస్ రమణ తెలుగు రాష్ట్రాలకు తనవంతు సహాయసహకారాలు అందిస్తూనే వున్నారు. హైద్రాబాద్ లో అంతర్జాతీయ మద్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42కు పెంచారు.
Read Also : నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి..
ఇంతకుముందు పని చేసిన సిజేఐలతో పోలిస్తే జస్టిస్ రమణ సుప్రీం కోర్టు తలుపులను ప్రజల కోసం మరింత భార్లా తెరిచారు. ఊత్తర ప్రత్యుత్తరాల ద్వారా ప్రజల మనసులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు వచ్చే ఉత్తరాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సర్వోనత న్యాయస్థానాన్ని సాదారణ ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. హక్కులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే వారే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారన్న నమ్మకంతో ప్రజాచైతన్యానికి ఆయన అధిక ప్రదాన్యతనిచ్చారు. ఎన్వీ రమణ తరువాత చీఫ్ జస్టిస్‌గా ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేయడానికి ముందురోజు ఎన్వీ రమణ సమక్షానికి కీలకమైన పిటీషన్లు రానున్నాయి. ఇవ్వాళ వాటి మీద విచారణ చేపట్టబోతున్నారాయన.
Also Read : రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ కుంభకోణానికి సంబంధించిన పిటీషన్ విచారణకు రానుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషుల విడుదలను చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పైనా సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో దోషులైన 11 మంది- రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బోంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.
Read Also : దుకాణాలు బంద్.. హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై దాఖలైన పిటీషన్లనూ ఆయన విచారించనున్నారు. అప్పట్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో మోదీ కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామాల మధ్య శుక్రవారం పదవీ విరమణ చేయబోతోన్న ఎన్వీ రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించనుంది. దీనికోసం ప్రత్యేకంగా వీడ్కోలు సభను నిర్వహించబోతోంది. సాయంత్రం 4:15 నిమిషాలకు సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయంలో గల మెయిన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. తదుపరి సీజేఐ యూయూ లలిత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు దీనికి హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి :
కమలం”జోరు”…. కాలీకానున్న కారు.
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
- జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
- అమిత్ షా సభతో బీజేపీలో జోష్…. బిసి అభ్యర్ది ఎంపికపైనే కేసిఆర్ దృష్టి ??