
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యారు. ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నలుగురు అభ్యర్థులు రేసులో నిలిచారు. ముునగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు స్రవంతి రెడ్డి, బిల్డర్ చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బీసీ నేతలు పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే గాంధీభవన్ లో గురువారం మాణిక్యం ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలతో చర్చలు జరిపిన అనంతరం అభ్యర్థిని పైనల్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
టికెట్ రేసులో ఉన్న నలుగురితో గాంధీభవన్ లో మొదట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క మాట్లాడారు. అశావాహులతో ఉమ్మడిగా, విడివిడిగా చర్చలు జరిపారు. తర్వాత మాణిక్యం ఠాగూర్ తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఆ తర్వాత మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థినిఖరారు చేశారు. పాల్వాయి స్రవంతి పేరు దాదాపు ఖరారైంది. దీంతో నివేదికను టీపీసీసీ అధిష్టానానికి నివేదిక పంపింది. అభ్యర్థి ఖరారు కావడంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి సారించనుంది.
Also Read : ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
మరోవైపు ఇప్పటివరకు మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉంటానని ప్రకటనలు చేస్తూ వస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అయ్యారు. తాను మునుగోడులో ప్రచారం చేస్తానని ప్రకటించారు. పీసీసీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి మునుగోడులో ప్రచారం చేస్తానని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు వెంకట్ రెడ్డి. ఆ సమావేశం తర్వాత ఆయన మనసు మార్చుకున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థిని ఖరారు చేయలేదు కాబట్టే.. మునుగోడులో ప్రచారం చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిసైడ్ అయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్… రేపటి నుండి యాత్ర ప్రారంభం
- మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
- ఎంఎల్‌ఏ రాజసింగ్ అరెస్ట్… పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…