
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తాను.. నా బలగం ప్రజలే.. మీ అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.
Read Also : గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
“ఒక ఇల్లు కట్టాఅలంటే చాలా సమయం ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. మూఢనమ్మకాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాటన్నింటిని రెండు మూడు రోజుల్లో కూలగొట్టొచ్చు. ఎంత కష్టమైతది. శిథిలమైపోతది. 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బెంగళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. ఈ సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో రావాలా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాల్సిన అవసరం ఉందని” కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read : ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. 80,000 టన్నుల వ్యర్ధాలు తో గండమేనా?
ఇవాళ రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎకరం భూమి ఉన్న వ్యక్తి కూడా పెద్ద కోటీశ్వరుడు. ఈ మత పిచ్చిల పడి దాన్ని చెడగొట్టుకోవాలా. నీచ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవద్దు. ఓట్ల కోసం భారత సొసైటీని గోస పెట్టే పరిస్థితి తెస్తున్నారు. మోదీ ఆగంఆగం అవుతున్నారు. ఉన్న పదవి చాలాదా? అంతకన్న పెద్ద పదవి లేదు కదా..? మన తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ఆలోచించాలి. తెలంగాణ సమాజాం ప్రశాంతంగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మత పిచ్చిగాళ్ల మాయలో పడొద్దని కేసీఆర్ సూచించారు..
Read Also : మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్
తిన్ననాడు, మత శక్తుల పిచ్చికి లోనయిన్పపుడు, మనం చెదిరిపోయిన్నాడు మళ్లీ పాత తెలంగాణలాగా తయారవుతామని కేసీఆర్ అన్నారు. బతుకులు ఆగం అవుతాయి. వీళ్లు ఎక్కడా ఉద్దరించింది లేదు. కుట్రలకు కాలు దువ్వుతున్నారు. స్వార్థ, నీచ, మతపిచ్చిగాళ్లను మనం ఎక్కడికక్కడ తరిమికొట్టాలి. అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మతపిచ్చికి లోనైతే ఒక వంద సంవత్సరాలు తెలంగాణ, భారతదేశం ఆగమైతది. ఒక్కసారి దెబ్బతింటే.. విభజన వస్తే సమాజానికి మంచిది కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రేమతో, గౌరవంతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతది. కానీ కర్ఫ్యూలతో, లాఠీఛార్జీలతో, కోపంతో, అసహ్యాంతో ఏ సమాజం కూడా పురోగమించిన దాఖలాలు లేవు. అలాంటి దానికి మన రాష్ట్రం బలికావొద్దని, ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలి. శాంతియుత తెలంగాణకు నడుం కట్టాలి. దానికోసం మనందరం ముందుకు పోవాలి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి. రంగారెడ్డి జిల్లా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి అగ్రభాగాన ఉండాలని కేసీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి :
- ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!