
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ అనుమతినిచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్ట్ ఆదేశాలతో బండి సంజయ్ శుక్రవారం నుంచి పాదయాత్రను నిర్వహించనున్నారు.
Read Also : గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
ఆగస్టు 23న బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ ఈ నోటీసులు ఇచ్చారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని ఈ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.
Also Read : ఎంఎల్‌ఏ రాజసింగ్ అరెస్ట్… పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
ఈ ఈ కారణంగా తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో స్పష్టం చేశారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే పాదయాత్రను అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు. విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బండి సంజయ్ శుక్రవారం నుంచి పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే పాదయాత్ర చేయనున్నారు. మరోవైపు, ఆగస్టు 27న వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
ఇవి కూడా చదవండి :
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
- రేపే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవి విరమణ….
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
- కమలం”జోరు”…. కాలీకానున్న కారు.
- నేడు మండల్ 104 జయంతి… బీసీలకు రిజర్వేషన్లను అందించిన ఘనత మండల్ దే