
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయమ్ ప్రారంభానికి సిద్దమైంది. రాష్ట్ర ముక్యమంత్రి కేసిఆర్ నేడు నేడు ప్రారంభించనున్నారు. హైద్రాబాద్ నగర శివారులోని కొంగరకలాన్ లో 44 ఎకరాల విస్తీర్ణంలో 58 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు అంతస్తులలో కలెక్టరేట్ భవన నిర్మాణం చేపట్టారు. ఈరోజు మద్యహనం 2 గంటలకు ముఖ్యమంత్రి కొంగరకలన్ చేరుకొని, కలెక్టరేట్ భవనసముదాయాన్ని ప్రారంబించనున్నారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తరువాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో కేసిఆర్ పాల్గొని ప్రజలను ఊదేశించి మాట్లాడనున్నారు.
Also Read : రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
సిఎం కేసిఆర్ భహిరంగ సభ నేపద్యంలో టిఆర్‌ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 వేల మందితో సభ నిర్వహించనున్నారు. సిఎం కేసిఆర్, మంత్రి సభిత రెడ్డి, జిల్లా అద్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డితో పాటు సుమారు 150 మంది జిల్లా ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిదులు, టిఆర్‌ఎస్ నాయకులు కూర్చునే విధంగా వేదికను ఏర్పాటు చేశారు. భహిరంగ సభ విజయవంతం చేసే భాద్యతలను మంత్రి సబితా రెడ్డి, కిషన్ రెడ్డి, రంజిత్ రెడ్డి చూసుకుంటున్నారు.
Read Also : దుకాణాలు బంద్.. హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్
ముఖ్యమంత్రి పర్యటన నేపద్యంలో రాచకొండ సిపి మహేశ్ భగవత్, అదనపు సిపి సురేంద్రబాబు ఆద్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నలుగురు డిసిపిలు, 15 మండి ఏసిపిలు, 30 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు వీరితో పాటు ఎస్వోటి బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
- కమలం”జోరు”…. కాలీకానున్న కారు..
- ఫలించిన రాధమ్మ న్యాయ పోరాటం…
- ఈటల రాజేందర్ ఇంట విషాధం…
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- కార్యాయలంలోనే కొట్టుకున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?