
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతోన్న 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక స్వాగతం పలకకుండ, ఆర్డీవో, డీసీపీ మాత్రమే స్వాగతం పలికారు.
Read Also : ఎంఎల్‌ఏ రాజసింగ్ అరెస్ట్… పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. తన ప్రొటోకాల్ గురించి మీరు గమనిస్తున్నారు కదా అంటూ గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గతంలో కూడా గవర్నర్ తమిళిసై విషయంలో పలుమార్లు ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని.. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
Also Read : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్‌చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలన్నారు గవర్నర్ తమిళిసై. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఇంజినీరింగ్, టెక్నాలజీ పరిశోధన మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 56 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. వీరితో పాటు 192 మందికి 276 బంగారు పతకాలను గవర్నర్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- రేపే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవి విరమణ…
- నేడు మండల్ 104 జయంతి… బీసీలకు రిజర్వేషన్లను అందించిన ఘనత మండల్ దే
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
-