
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను వెస్ట్ జోన్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి భారీగా బలగాలతో వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, అరెస్ట్ సందర్భంగా రాజా సింగ్ అభిమానులు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. రాజా సింగ్‌కు మద్దతుగా, కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. చర్లపల్లి జైలుకు రాజా సింగ్‌ను పోలీసులు తరలించారు.
Read Also : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
2004 రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయని, ఇందులో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మునావర్ ఫారూఖీ వల్లే హైదరాబాద్‌లో కమ్యూనల్ వాయిలెన్స్ జరిగాయని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. రాముడు, సీతను తిట్టే వ్యక్తిని హైదరాబాద్ తీసుకురావొద్దని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీకి తాను విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవాలని మండిపడ్డారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారుఖీ అని వెల్లడించారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని తెలిపారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంమని చెప్పారు.
Also Read : రేపే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవి విరమణ….
తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తానని వివరించారు. పాతబస్తీలో ఆందోళనలకు కారణం ఎంఐఎం నేతలేనన్నారు రాజాసింగ్. పోలీసులపై గతంలో దాడికి పాల్పడిన ఎంఐఎం నేతలకు రక్షణ ఉందన్నారు. పోలీసులు ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగానే మునావర్‌ను రప్పించారని రాజా సింగ్ ఆరోపించారు. ఈ ఏడాది ఫిభ్రవరి 19న మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని… కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాహినాయత్ గంజ్ ఠాణాలోనూ ఏప్రిల్ 12న మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా పాట పాడారని, ఎస్సై రాజేశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షాహినాయత్ గంజ్ ఠాణాలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Read Also : నేడు మండల్ 104 జయంతి… బీసీలకు రిజర్వేషన్లను అందించిన ఘనత మండల్ దే
ఈ రెండు కేసులలోనూ పోలీసులు గురువారం ఉదయం 11 గంటల సమయంలో రాజాసింగ్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఆర్నెళ్ల క్రితం కేసులు నమోదైతే.. పోలీసులు ఇన్ని రోజులు ఏం చేశారని, నిద్ర పోతున్నారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్‌కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ను గురువారం మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి :
- నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి..
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
- కమలం”జోరు”…. కాలీకానున్న కారు.
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి