
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ. 70కోట్లు వెచ్చించారు. అయితే ఈ రెండు టవర్స్ ను కూల్చేందుకు సుమారు రూ. 20కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ముహూర్తాన్నిసైతం ఫిక్స్ చేశారు. 2014లో అలహాబాద్ హైకోర్టు ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని ప్రకటించడంతో, జంట టవర్లను కూల్చివేయాలనే నిర్ణయాన్ని ఆగస్టు 18 సుప్రీంకోర్టు ఆమోదించింది. వాస్తవానికి ఈ నెల 21న కూల్చివేయాలని నిర్ణయించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కూల్చివేత తేదీని ఆగస్టు 28కి పొడిగించారు.
Also Read : మత పిచ్చిగాళ్లను తరిమికొడతా.. నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వ!
నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ కంపెనీ 2009లో రూ. 70 కోట్ల వ్యయంతో ఈ టవర్లను నిర్మించింది. ఈ టవర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో కూల్చివేసేందుకు అక్కడి పాలకవర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో వీటిని కూల్చివేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. ఈ రెండు టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చడం ఇప్పటికై పూర్తయింది. ప్రస్తుతం బాంబులను ఒకదానికొకటి అనుసంధానం చేస్తున్నారు. ఈ కూల్చివేత బాధ్యతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు దుమ్ముపట్టకుండా కవర్లతో కప్పి ఉంచారు. నియంత్రిత ఇంప్లోషన్ టెక్నిక్ ద్వారా ఈ కూల్చివేత ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు
Read Also : ఏడాది పాటు జైలులోనే రాజాసింగ్… ఎన్నికల్లో పోటీ కష్టమేనా?
నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతతో 80,000 టన్నుల ఘన వ్యర్ధాలు పేరుకుపోతాయని నోయిడా సీఈవో రితు మహేశ్వరి చెప్పారు. 50,000 టన్నుల వ్యర్దాలను సైట్‌లో ఉంచి మిగిలిన 30,000 టన్నులను సెక్టార్-80లోని నిర్మాణ, డిమాలిషన్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయంగా ధ్వంసం చేస్తామని చెప్పారు.
వ్యర్ధాల్లో ఎక్కువభాగం బిల్డింగ్ బేస్‌మెంట్స్ ఫిల్ చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. వ్యర్ధాల తొలగింపు సకాలంలో వేగంగా చేపడతామని ఆమె వెల్లడించారు. మొత్తం వ్యర్ధాల్లో 4000 టన్నులు ఇనుము, టీఎంటీ బార్లు, భవన నిర్మాణానికి వాడిన ఇతర ఇనుము పరికరాలు ఉంటాయని అన్నారు. ఇనుప వ్యర్ధాలను డిమాలిషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎడిఫైస్ వేరుచేసి తర్వాత వాటిని విక్రయిస్తారని తెలిపారు.సైట్ నుంచి వ్యర్ధాల తొలగింపునకు మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు. 32,29 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3700 కిలోల పీఈటీఎన్ పేలుడుపదార్ధాలను వాడతారని డిమాలిషన్ మేనేజ్‌మెంట్ బృందం తెలిపింది. ఇక ఆదివారం మద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ట్విన్ టవర్స్ కూల్చివేత జరుగుతుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ప్రచారానికి కోమటిరెడ్డి!
- ఓల్డ్ సిటీలో భారీ భద్రత, ముస్లింల ప్రత్యేక పార్ధనాల నేపథ్యంలో పటిష్ట నిఘా..
- గవర్నర్ పర్యటనలో మళ్ళీ ప్రోటోకాల్ ఉల్లంఘన….
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
- రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!