
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్లు షాక్ ఇచ్చారని తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే మునుగోడు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు బిల్డర్ చల్లమల్ల కృష్ణారెడ్డి. ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డే తెరపైకి తెచ్చారనే ప్రచారం ఉంది. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. చండూరు బహిరంగ సభ, తర్వాత నిర్వహించిన పాదయాత్రకు జనసమీకరణ అంతా చలమల్ల నేతృత్వంలోనే సాగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండదండలు ఉండటంతో మునుగోడు టికెట్ కృష్ఠారెడ్డికి ఖరారైందనే చర్చ కాంగ్రెస్ వర్గాలతో పాటు మునుగోడు నియోజకవర్గంలో సాగుతోంది.
అయితే అభ్యర్థి విషయంలో రేవంత్ కు పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణారెడ్డి పేరును హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా.. సీనియర్ నేతలు మాత్రం మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరును సూచించారని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు కూడా స్రవంతికై జైకొట్టారని అంటున్నారు. దీంతో హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన చల్లమల్ల కృష్ణారెడ్డిని కాకుండా పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.రెండు రోజుల క్రితం పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ సమక్షంలో సమావేశమైన రాష్ట్ర నేతలు సమిష్టిగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. అభ్యర్థిని వీలైనంత త్వరగాప్రకటించి నియోజకవర్గంలో ప్రచారానికి దిగాలని అధిష్టానం భావిస్తుంది.
2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతికి 27,441 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచారు. మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం స్రవంతికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకొస్తున్నారు. కృష్ణారెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నా నియోజకవర్గంలో ఎవరికి తెలియకపోవడం ఆయనకు మైనస్ గా మారిందని అంటున్నారు. స్రవంతికి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని హైకమాండ్ భావనగా ఉందంటున్నారు. అయితే కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ ఖర్చు చేస్తున్న కృష్ణారెడ్డికి హైకమాండ్ ఎలాంటి హామీ ఇస్తుంది.. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి …
- దుకాణాలు బంద్.. హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్
- కమలం”జోరు”…. కాలీకానున్న కారు.
- ఫలించిన రాధమ్మ న్యాయ పోరాటం…
- ఈటల రాజేందర్ ఇంట విషాధం…
- మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్