
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : తన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గత నలభై తొమ్మిది రోజులుగా శివన్నగూడెం గ్రామానికి చెందిన గోల్కొండ రాధమ్మ చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది. ఇరువర్గాల నుండి వాస్తవాలను గుర్తించిన అధికార యంత్రాంగం, రాధమ్మ దే న్యాయమని తెల్చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ రాధమ్మ వద్దకు వచ్చి తన భూమి హక్కు పత్రాలను అందించి దీక్ష విరమింపజేశారు. ఇన్ని రోజులు వెన్నంటే ఉండి తోడుగా నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, టీడీపీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : ఈటల రాజేందర్ ఇంట విషాధం…
సంఘీభావం ప్రకటిస్తూ, మద్దతు ప్రకటించిన పలు పార్టీ నాయకులకు, కుల సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డివో గోపిరామ్, సిపిఐ మండల సెక్రటరీ ఈదుల బిక్షం రెడ్డి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు వడ్డె వెంకటేష్ మాదిగ, సిపిఐ సీనియర్ నాయకులు కళ్లెం యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదగోని శ్రీను గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ తారకరామన్, ఎంపివో ఝాన్సీ, పంచాయతీ సెక్రటరి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్
- చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి