
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక రోజు రోజుకు జోరందుకుంటుంది. ఒక పార్టీ నుండి మరో పార్టీకి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ బై ఎలెక్షన్ కి తెరాస పార్టీ నుండి కీలకంగా మునుగోడు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యవహారం కొంతమంది తెరాస పార్టీ నాయకులకు నచ్చటం లేదని టాక్. వేరే పార్టీ నుంచి తెరాసకు వలసలు వస్తున్న నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆయన అనుగ్రహం మెండుగానే ఉంటుందని, కానీ ఇన్నెండ్లుగా పని చేస్తున్న మా పరిస్థితి ఏంటని కొంతమంది ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నారు.
Read Also : ఫలించిన రాధమ్మ న్యాయ పోరాటం…
మర్రిగూడ మండలంలోని కొంతమంది ఎంపిటిసి లు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు కమలానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మండలంలోని కమల దళపతులు వారితో రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఇక చర్చలు సఫలం కావటమే ఆలస్యం కాషాయానికి కాయం అనుకుంటున్నారు అనుభవజ్ఞ్యులు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే క్యాడర్ చేజారిపోయినప్పటికి, నువ్వా నేనా అనే కొట్లాటలో మునిగి తెలుతున్నారు ఒక పక్క స్రవంతి వర్గం, క్రిష్ణా రెడ్డి వర్గం. ఈ తోపులాటలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీలు మారుతూ బయటికి వెళ్లిపోతున్నారు.
Also Read : ఈటల రాజేందర్ ఇంట విషాధం…
ఇదే తరహాలో తెరాస పార్టీ నుండి కూడా కమలానికి వలసలు పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఒకే సారి మర్రిగూడలో గంపగుత్తగా కారు కాళీ కానుందని విశ్వసనీయ సమాచారం. దీని వెనుక తెరాస పార్టీకి చెందిన ఒక మండల ప్రజా ప్రతినిది కీ రోల్ పోషిస్తున్నట్లు, ఇలా అన్ని మండలాలలో కూడా ఇదే తంతు కొనసాగేలా తెలుస్తుంది. అదే జరిగితే తెరాస పార్టీ కి డిపాజిట్లు కూడా దక్కవని, హుజురాబాద్ మాదిరిగానే ఓటమి తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్
- చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి