
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలో టాప్ బిజినెస్ మెన్ అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జాతీయస్థాయిలో ప్రముఖ మీడియా సంస్థగా గుర్తింపు పొందిన ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్) లో మెజార్టీ వాటా కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ తాజాగా ప్రతిపాదన చేసింది. 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటి రూ.294 ముఖ విలువతో మొత్తం రూ.492 కోట్లకు కొనుగోలు చేసేందుకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈమేరకు ఎన్డీటీవీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి.
Read More : బ్యూటీపార్లర్ పెట్టిస్తానని.. రెండేళ్లుగా అత్యాచారం
విశ్వప్రధాన్ కమర్షియల్ ను తన సబ్సిడరీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ తో రూ.113.75 కోట్లతో కొనుగోలు చేయించినట్టు అదానీ ఎంటర్ ప్రైజెస్ తన ఎక్చేంజి ఫైలింగ్ లో పేర్కొంది. అటు, అదానీ గ్రూప్ నుంచి అందిన ఓపెన్ ఆఫర్ ప్రతిని ఎన్డీటీవీ స్టాక్ ఎక్చేంజీలకు సమర్పించింది. అదానీ గ్రూప్ గత మార్చిలో స్థానిక డిజిటల్ బిజినెస్ న్యూప్ ప్లాట్ ఫామ్ క్వింటిల్లియన్ లోనూ మైనారిటీ వాటా చేజిక్కించుకుంది. భారత మీడియా రంగంలోకి అదానీ తొలి అడుగు ఇదే. ఇప్పుడు ఎన్డీటీవీలోనూ వాటాలు చేజిక్కించుకోవడం ద్వారా జాతీయ మీడియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ప్రస్థానం సాగిస్తున్నారు.
Read More : చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించిన తహశీల్దార్
మోడీ సర్కార్ అదానీ గ్రూప్ కు ప్రభుత్వ సొమ్ము అప్పగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రాజెక్టులన్ని అదానీ గ్రూప్ కే కట్టబెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ గ్రూపుకే కట్టబెట్టాయి. ఈ పరిస్థితుల్లో మీడియా రంగంలోకి అదానీ గ్రూప్ ఎంటర్ కానుడటం సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి …
- చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
- బిజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్….
- గోషామహల్ ఎంఎల్‌ఏ రాజసింగ్ అరెస్ట్… హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
One Comment