
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి చెందిన 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది ఫీనిక్స్. సంస్థ చైర్మెన్ , డైరెక్టర్ల నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ లోని ఐటీ సెజ్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఫినిక్స్ సంస్థ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సంస్థలో చాలా మంది రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఐటీని ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఫీనిక్స్ సంస్థలో సోదాలు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గానే జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఫీనిక్స్ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు కేటీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఫీనిక్స్ గ్రూప్ దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని వందలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఫీనిక్స్ గ్రూప్ అప్పనంగా అప్పగించిందని సమాచారం.దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన పెద్దలు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని నిర్దారించారని తెలుస్తోంది. ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్
- చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?
- బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
- భీమ్లానాయక్ మొగిలయ్యకు ఇంటి స్థలం, కోటి రూపాయలు!
- అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్….