
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మునుగోడు నియోజక వర్గంలో బై ఎలక్షన్స్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. సర్కారు వారి పాటలా పలు పార్టీ నేతలను అధికార పార్టీ పెద్దలు ఆకర్షించే పనిలో పడ్డారు. మల్లి రానున్న ఎన్నికలలో మునుగోడు తీర్పు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారనుందని విశ్లేషకుల అంచనా..
బిజెపి పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే అభ్యర్ది కావటం అధికార పార్టీ కి సవాలుగా మారింది. ఈ నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ నుండే కాకుండా ఇతర పార్టీల నుండి కూడా ప్రజా ప్రతినిధులతో పాటు, కీలక నేతలకు మంచి డిమాండ్ పలుకుతుందని ప్రజలు అనుకుంటున్నారు.
Read Also : ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
ఇక తెరాస పార్టీ నుండి కూసుకుంట్ల పేరు దాదాపు కరారు అయినప్పటికి అధిష్టానం మాత్రం మరో మారు పునరాలోచనలో ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చెయ్యటానికి సిద్దంగా ఉన్నప్పటికి ఈ బై ఎలక్షన్ లో ఆర్ధికంగా తట్టుకునే శక్తి ఉందా అనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అలోచిస్తునట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చెల్లమల్ల క్రిష్ణారెడ్డి పేరు తెర మీదికి రావటంతో, టికెట్ ఆయనకే వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఆయన పేరు అంతలా నానకున్నా ఆర్ధికంగా ఎలక్షన్ లో తట్టుకోగలరనే ఆలోచనలో పార్టీ దాదాపు ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసేలా ఉందని వినికిడి.
Also Read : బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
ఇప్పటికే క్రిష్ణారెడ్డి నియోజక వర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ, నేతలను పరిచయం చేసుకుంటున్నాడని సమాచారం. ఈ పరిస్థితులలో ప్రయోగాలు చెయ్యటం, ఒక్క సారి అవకాశాలు ఇవ్వటం అనేవి కత్తి మీద సాముల మారే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతల టాక్. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నేతలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, మల్లి పుంజుకోనుందా…? అనే ఆలోచనలో కార్యకర్తలు సైతం అయోమయంలో పడిపోయారు. ఈ సారి పోటీ చేసే అభ్యర్ధిని బట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోనుందని తెలుస్తుంది. ఈ బై ఎలక్షన్ లో మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లకు కాసుల వర్షం కురిసేలా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- బిజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్….
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
- రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేను.. సోనియాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
- ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” ట్రైలర్ లాంచ్
- జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
One Comment