
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనపై హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. తక్షణమే అరెస్ట్ చేయాలంటూ అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకులు సహా పలు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు వ్యతిరేకంగా రాజా సింగ్ తాజాగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
Read Also : ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
10 నిమిషాల 27 సెకెండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద పోస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్త పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆయన ప్రస్తావనను తీసుకొచ్చారు. మునావర్ ఫారూఖీ ఇదివరకు శ్రీరామచంద్రుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజా సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఏఐఎంఐఎం సహా పలువురు ముస్లిం సంఘాల ప్రతినిదులు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. బషీర్ బాగ్‌లో గల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు బైఠాయించారు. రాజా సింగ్‌కు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
Also Read : రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేను.. సోనియాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
అదే సమయంలో డబీర్ పురా, గోషా మహల్, నాంపల్లి వంటి పలు పోలీస్ స్టేషన్లల్లో రాజా సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు రషీద్ ఖాన్, మజ్లిస్ శాసన సభ్యుడు అహ్మద్ బలాలా తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయనను అరెస్ట్ చేశారు. అదే సమయంలో రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోను కూడా యూట్యూబ్ నుంచి తొలగించారు పోలీసులు. ఇక ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు పోలీసులు. సున్నిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అటు టీ రాజా సింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” ట్రైలర్ లాంచ్
- తెరాస లో బిసి గళం… మునుగోడు టికెట్ బీసీలకే ఇవ్వాలన్న బూర నర్సయ్య
- జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
- కేసిఆర్ కు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…