
- మునుగోడు లో 72 శాతం ఉన్న బడుగులు
- రాజకీయ చైతన్యమే… రాజ్యాధికారానికి సోపానం
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిది : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించి నియోజకవర్గ పరిధిలో 72 శాతం ఉన్న బడుగులకు సీటు కేటాయించాలి. నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల 27 మంది ఓటర్లు ఉండగా 1,40,000 మంది ఓటర్లు బీసీ కులాలకు చెందిన వారే. కేవలం నాలుగు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లే లక్ష పైచిలుకు ఉంటారని ఒక అంచనా. మునుగోడు నియోజకవర్గ పరిధిలో కులాల వారీగా పరిశీలిస్తే… గౌడ, పద్మశాలి, ముదిరాజ్ (బంటు, బోయ, గంగపుత్ర) యాదవ, కురుమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండగా, మిగిలిన బీసీ కులాలైన కుమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, వడ్రంగి , కమ్మర కులస్తులు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
Read More : అమిత్ షా సభతో బీజేపీలో జోష్…. బిసి అభ్యర్ది ఎంపికపైనే కేసిఆర్ దృష్టి ??
అయినా ఇప్పటివరకు ఈ సామాజిక వర్గాల నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడే లేరు. ఎందుకంటే ప్రధాన పార్టీలు కేవలం ఐదు ఆరు శాతం ఓట్లు కలిగినటువంటి రెడ్డి, మూడు శాతం ఓట్లను వెలమ సామాజిక వర్గాలను మాత్రమే రాజకీయంగా ప్రోత్సహించి టికెట్లను కట్టబెట్టాయి. ఈ నియోజకవర్గంలో నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆరుసార్లు విజయం సాధించగా, కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ) తరఫున ఒకసారి, టిఆర్ఎస్ తరఫున మరొకసారి రెడ్డి నాయకుడు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇక సిపిఐ తరఫున నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉజ్జిని నారాయణరావు, ఆయన తనయుడు యాదగిరిరావు లు మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేవలం 6 నుంచి ఏడు శాతం ఓటు బ్యాంకు కలిగిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎనిమిది సార్లు, రెండు నుంచి మూడు శాతం కలిగిన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాలుగుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టగా లేనిది, 72% ఓటు బ్యాంకు కలిగిన బీసీలను ప్రధాన పార్టీలు ఎందుకు విస్మరిస్తున్నాయన్నది అంతు చిక్కడం లేదు.
Read More : కార్యాయలంలోనే కొట్టుకున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?
బీసీలలో రాజకీయ చైతన్యం లేదా? అంటే… రాజకీయ చైతన్యానికి కొదవేమీ లేదు, కానీ బూర్జువా పార్టీల నాయకత్వపగ్గాలు ఆధిపత్య కులాల చేతిలో ఉండడం వల్లే, బీసీ నేతలను రాజకీయంగా ప్రోత్సహించడానికి ఎంత మాత్రం సుముఖత చూపడం లేదన్నది నిర్వివాదాంశం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగానైనా , ప్రధాన పార్టీలను ఈ అవాంఛనీయ ధోరణి మారాలి. లేకపోతే బీసీలంతా ఏకమై, బీసీ నేతకే మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే జనాభా దామాషా ప్రకారం గా చట్టసభలలో ప్రాతినిధ్యమన్నది కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం లేకపోలేదు.
బద్దుల శ్రీధర్ యాదవ్
కన్వీనర్
బీసీ రాజ్యాధికార సాధన సమితి ( బీసీ ఆర్ ఎస్ ఎస్)
మునుగోడు లో కులాల వారిగా ఓట్ల వివరాలు ( ప్రస్తుతం ఈ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది) మునుగోడు నియోజవర్గంలో కులాల వారీగా ఓట్లు … గౌడ్స్- 25200, పద్మశాలి- 31680, ముదిరాజ్ ( బంటు బోయ గంగపుత్ర) 24050, మాదిగ-25650, యాదవ, కురుమ 27, 360, లంబాడి/ఎరుకుల– 10520, మాల- 10350, వడ్డెర- 8350, కుమ్మరి- 7850, విశ్వబ్రాహ్మణ- 7820, ముస్లిం- 7650, రెడ్డి – 7690, కమ్మ-5680, ఆర్యవైశ్య- 5760, మున్నూరుకాపు- 3350, ఇతరులు- 19520 మండలాల వారిగా ఓటర్ల జాబితా వివరాలు … మునుగోడు నియోజకవర్గ ఓటర్లు మండల వారిగా
1. చౌటుప్పల్ 55,942,
2. నారాయణపూర్. 34089
3. మునుగోడు 35467
4. చండూర్ 39829
5. మర్రిగూడెం 30,237
6. నాంపల్లి 31,701
మొత్తం 2,27,265
ఇవి కూడా చదవండి …
- రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేను.. సోనియాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
- తెరాస లో బిసి గళం… మునుగోడు టికెట్ బీసీలకే ఇవ్వాలన్న బూర నర్సయ్య
- జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
- కేసిఆర్ కు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
- మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్… నేడు డిల్లీలో నేతలతో కీలక భేటీ..