
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం చల్లారేలా కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు రేవంత్ రెడ్డి. అయినా కోమటిరెడ్డి మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మునుగోడుపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం కాంగ్రెస్ లో సంచలనంగా మారింది.
ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత శ్రీధర్ బాబు హాజరయ్యారు. సమావేశానికి రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం ఉన్నా ఆయన హాజరుకాలేదు. ప్రియాంక గాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Read More : వామపక్షాలకు కేసీఆర్ కేటాయించే సీట్లు ఇవేనా?
రేవంత్ రెడ్డి తనను పదేపదే అవమాన పరుస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటుఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. చండూరు లో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాలను కోమటిరెడ్డి ప్రస్తావించారు. తన కుటుంబం పై చేసిన కామెంట్స్ ను లేఖలో పేర్కొన్నారు వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి తో తాను వేదిక పంచుకోలేనంటూ వివరణ ఇచ్చారు. సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది.తాజా పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి …
- తెరాస లో బిసి గళం… మునుగోడు టికెట్ బీసీలకే ఇవ్వాలన్న బూర నర్సయ్య
- జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
- కేసిఆర్ కు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
- మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్… నేడు డిల్లీలో నేతలతో కీలక భేటీ..
- అమిత్ షా సభతో బీజేపీలో జోష్…. బిసి అభ్యర్ది ఎంపికపైనే కేసిఆర్ దృష్టి ??