
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అధికార తెరాస పార్టీలో ఎట్టకేలకు బీసీ గళం వినిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో 72 శాతం ఉన్న బడుగులకే టికెట్ ఇవ్వాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నినదించారు. మునుగోడులో రెండు లక్షల 26 వేల ఓట్లు ఉంటే, అందులో రెండు లక్షల ఐదు వేల ఓట్లు బహుజనులవేనని చెప్పారు. ఇక బడుగు , బలహీనవర్గాలవే లక్ష 40 వేల ఓట్లు ఉంటాయని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో పద్మశాలి లు, గౌడ, ముదిరాజ్, (బంటు, బోయ, గంగ పుత్రులు,) యాదవ, కురుమ, కుమ్మరి, రజక సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ కులాల ఓటర్లు కూడా గణనీయంగానే ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా బూర నర్సయ్య చెప్పకనే చెప్పారు.
మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి, నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే శాసనసభ్యులుగా చట్టసభల్లో అడుగు పెట్టారని ఆయన గుర్తు చేశారు.
Read Also : జిల్లాల పర్యటనకు సిఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్..!!!
ఈసారి మెజారిటీ ఓటర్లైన బీసీలకు తెరాస టికెట్ ఇవ్వాలని బూర నర్సయ్య కోరారు. బూర నర్సయ్య వ్యాఖ్యలు ఆదిపత్య కులాలలో కలకలాన్ని సృష్టించాయి. తమ రాజ్యాధికారానికి నరసయ్య వ్యాఖ్యలు గండి కొడతాయన్న భయంతో, వెంటనే రంగంలోకి దిగిన ఆధిపత్య కులాల నేతలు ఆయన చేత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే, మునుగోడు ఉపఎన్నిక టికెట్ బీసీలకే ఇవ్వాలన్న బూర నర్సయ్య వ్యాఖ్యలను బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్ స్వాగతించారు.
Also Read : కేసిఆర్ కు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
బీసీలలో ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నప్పటికీ, మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీసీ నేతలను ప్రధాన పార్టీలు అభ్యర్థులుగా పరిగణించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందని, జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం లభించాల్సి ఉండగా, దేశం ఒక వైపు స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్నప్పటికీ, ఇంకా చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన అన్నారు.
మునుగోడు లో 72 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయించడానికి వెనుకాడడం పరిశీలిస్తే, ఇంకా బీసీలను రాజకీయంగా అణిచివేయాలన్న కుట్ర స్పష్టమవుతూనే ఉందని, బీసీలు ఇంకా సంక్షేమ పథకాల కోసం వెంపర్లాడే కంటే, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే, మన అభివృద్ధిని మన సంక్షేమాన్ని మనమే చూసుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని, ఎవరో మనకు సంక్షేమ పథకాలను బిక్షంగా వేయాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్… నేడు డిల్లీలో నేతలతో కీలక భేటీ..
- అమిత్ షా సభతో బీజేపీలో జోష్…. బిసి అభ్యర్ది ఎంపికపైనే కేసిఆర్ దృష్టి ??
- కమ్యూనిస్టుల పేపర్ ను కేసీఆర్ ఆక్రమించారు… అయినా మద్దతు ఇస్తారా! మునుగోడు సభలో ఈటల రాజేందర్ ఫైర్
- దళిత కార్యకర్త ఇంటికి అమిత్ షా.. సాంబమూర్తి నగర్ వాసుల సంతోషం
- వామపక్షాలకు కేసీఆర్ కేటాయించే సీట్లు ఇవేనా?