
క్రైమ్ మిర్రర్, మంచిర్యాల : అది గ్రామ సచివాలయం అక్కడికి వెళితే గ్రామంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గ్రామ ప్రజల భరోసా అయితే అంతటి విశిష్టత కలిగిన గ్రామ సచివాలయ కార్యాలయం ఆధిపత్య పోరుతో అబాసుపాలవుతోంది. అందరు చూస్తుండగానే సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి ఇరువురు కలబడి కొట్టుకోవడం, అందుకు గ్రామ పంచాయతీ కార్యాలయమే వేదిక కావడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య జరిగిన ముష్టి యుద్ధానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంతోపాటు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరితహారం కార్యక్రమంపై చర్చలో.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అలుగునూరి సులోచన భర్త రవి ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం చేపట్టే హరిత హారం కార్యక్రమం గురించి చెట్లను తెప్పించే విషయం చర్చిస్తుండగా సర్పంచ్ సులోచన, పంచాయతీ కార్యదర్శి గంగారాం మధ్య మాట మాట పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. అక్కడే ఉన్న సర్పంచ్ సులోచన భర్త రవి, పంచాయతీ కార్యదర్శి లు కూడా ఒకరి పై ఒకరు పడి కలబడి కొట్టుకున్నారు.
Read More : ఇంకా ఈ కుల వివక్ష ఏమిటి?… ఇంకెన్నాళ్లు ఈ సామాజిక అస్పృశ్యత???
ఈ సంఘటనలో కార్యదర్శి గంగారాం చెయ్యి విరిగిందని అయన తెలుపగా, సర్పంచ్ సులోచన కూడ తనను కార్యదర్శి క్రింద పడేసి కొట్టాడని, దీంతో తనకు ఛాతిలో దెబ్బ తగిలింది అని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్నారం ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని లక్షెట్టి పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చేయని పనులకు చెక్కులు రాయమని సర్పంచ్, ఆమె భర్త తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో దూషిస్తున్నారని, తనపై ఈ రోజు దాడి కూడా చేశారని పంచాయతీ కార్యదర్శి ఆరోపించారు. ఇదిలా ఉంటే కార్యదర్శి తనను కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మహిళనని కూడా చూడకుండా తనపై దాడి చేశాడని, నిలదీసినందుకు తన భర్తపై కూడా దాడి చేశాడని సర్పంచ్ సులోచన పేర్కొన్నారు.
Read More : “చే “జారిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్… పత్తాకులేని పార్టీ నేతలు
మొత్తంమీద వీరి వాదనలు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఈ ఇరువురి మధ్యలో చాలా రోజుల నుండి గొడవలు నడుస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా రేపటి హరితహారం కార్యక్రమం గురించి ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఏదిఏమైనప్పటి పంచాయతీ కార్యాలయంలో ఇరువురు కొట్టుకోవడం మాత్రం జిల్లాలో సంచలనం రేపిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి …
- కూసుకుంట్లకు షాకిచ్చిన కేసీఆర్… బీసీ నేతకే మునుగోడు టీఆర్ఎస్ టికెట్?
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా.. మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
- టిఆర్ఎస్ కు మద్దతుగా కమ్యూనిస్టు నేతలు… ప్రజల ఆశలు మట్టిపాలు
- బిడ్డా మోడీ, అమిత్ షా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. మునుగోడు సభలో కేసీఆర్ సవాల్
- రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా అంటే బీ ఫామ్… రేవంత్ రెడ్డి