
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : మునుగోడు సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు ఇచ్చిన ధైర్యంతో… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ పాలనపై సమరశంఖం మోగించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ వెంటే ఉన్నారని… హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించిన దానికంటే పెద్ద మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని అంటున్నారని చెప్పారు. కేసీఆర్ ది శాడిస్టిక్ మెంటాల్టీ అని… అందుకే ఈరోజు మునుగోడులో అమిత్ షా సభ ఉంటే… నిన్న హడావుడిగా కేసీఆర్ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యధిక ప్రజల ప్రేమను పొందిన నేత ప్రధాని మోదీ అని… అలాంటి మోదీని బంగాళాఖాతంలో ముంచేస్తామని కేసీఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో ముంచేస్తారని అన్నారు.
Read More : టిఆర్ఎస్ కు మద్దతుగా కమ్యూనిస్టు నేతలు… ప్రజల ఆశలు మట్టిపాలు
ఇదే సమయంలో కమ్యూనిస్టు నేతలపై ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కు కమ్యూనిస్టులు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై ఈటల స్పందిస్తూ… గత ఎనిమిదన్నరేళ్లుగా కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్ పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఏనాడైనా మీరు ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టారా అని అడిగారు. కేసీఆర్ కు మీరు మద్దతు పలకడం సిగ్గు చేటని అన్నారు. కమ్యూనిస్టుల పేపర్ మన తెలంగాణను కేసీఆర్ ఆక్రమించుకున్నారని చెప్పారు. ఈరోజు కమ్యూనిస్టులకు కేసీఆర్ శాంతికాముకుడిగా కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో అంటకాగేవారిని ప్రజలు క్షమించరని అన్నారు.
Read More : బిడ్డా మోడీ, అమిత్ షా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. మునుగోడు సభలో కేసీఆర్ సవాల్
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం ఖరారయిందని ఈటల అన్నారు. రాజగోపాల్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ కంటే ముగుగోడు గడ్డ చాలా చైతన్యవంతమైనదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలనేదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. బీజేపీ గెలిస్తే వ్యవసాయానికి మీటర్లు పెడతారని కేసీఆర్ జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని… దేశంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మీటర్లను పెట్టించలేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈటల అన్నారు. కేసీఆర్ నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి …
- దళిత కార్యకర్త ఇంటికి అమిత్ షా.. సాంబమూర్తి నగర్ వాసుల సంతోషం
- వామపక్షాలకు కేసీఆర్ కేటాయించే సీట్లు ఇవేనా?
- కార్యాయలంలోనే కొట్టుకున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?
- కూసుకుంట్లకు షాకిచ్చిన కేసీఆర్… బీసీ నేతకే మునుగోడు టీఆర్ఎస్ టికెట్?
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా.. మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
AHzKPRtUmyf