
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత తండాలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తర్వాత చౌటుప్పల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : అందరి కళ్ళు మునుగోడుపైనే… సిఎం కేసిఆర్ సభలో ఏం మాట్లాడబోతున్నాడు ???
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇవ్వడంపై తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి. విప్లవ పోరాటాల్లో ముందుండే కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరమన్నారు. వామపక్షాల నిర్ణయంతో పేదల కోసం ఇంత కాలం వాళ్లు చేసిన పోరాటాలు వృథా అయ్యాయని అన్నారు. ఉప ఎన్నిక కారణంగా స్థానిక సంస్థల ప్రతినిధులు అమ్ముడుపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లినా తమకు నష్టం లేదన్నారు. తాము పేదల పక్షానే ఉంటామని, పోడు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మునుగోడు కు ఒక చరిత్ర ఉందని.. సాయుద రైతాంగ పోరాటానికి ఇక్కడి నాయకులు నేతృత్వం వహించారని అన్నారు. కేసీఆర్ పాలనలో నల్లగొండ ను పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్నారు రేవంత్ రెడ్డి.పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు ..రుణమాఫీ జరగలేదని చెప్పారు. జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయన్నారు. జిల్లాలో గౌడ సోదరులకు, యాదవులకు, పద్మశాలి సామాజిక వర్గానికి న్యాయం జరగలేదన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రోత్సహించి .. కల్లు వ్యాపారాన్ని నిర్వీర్యం చేశారని రేవంత్ విమర్శించారు.
Also Read : మునుగోడులో కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి
కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను .. ప్రజా సంఘాలను చంపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలా బీజేపీతో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పక్క పార్టీ నేతలను కొనేందుకు బీజేపీ ప్రత్యేక కమిటీ వేసుకోవడం దుర్మార్గమన్నారు.బీజేపీ పిరాయింపులకు కేసీఆర్ ఆదర్శం గా కనిపిస్తుందని అన్నారు. బీజేపీ లో చేరినప్పుడే పండగ .. తరువాత తలుపులు మూసుకొని ఏడుస్తారని చెప్పారు అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు అంటున్న రాజగోపాల్ రెడ్డి .. కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా అంటే బీ ఫామ్ ఇస్తామన్నారు. తాను మునుగోడులో ఇంటింటికి తిరిగి రాజగోపాల్ రెడ్డిని గెలిప్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి కోసమే రాజీనామా అంటున్న బీజేపీ నేతలు.. వాళ్ల నలుగురు ఎంపిలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు.
Read Also : తెరాస మెడకు భూ నిర్వాసితుల ఉచ్చు… నష్టపరిహారం చెల్లించాలంటూ ఏడాదిగా నిర్వాసితుల నిరసన దీక్షలు
బీజేపీ నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుంది కదా అని నిలదీశారు. పార్టీ మారిన రాజేందర్, రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు మునుగోడులో పార్టీ మారిన స్థానిక సంస్థల ప్రతినిధులతోనూ రాజీనామా చేయిస్తుందా అని ప్రశ్నించారు. అమ్ముడు పోయిన స్థానిక ప్రజా ప్రతినిధులను రాజీనామా చేయాలని గ్రామాల్లో ప్రజలు డిమాండ్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేయడం ద్వారా బీజేపీ టిఆర్ఎస్ తోడు దొంగలకు బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. కాంగ్రెస్ డబ్బులు పంచదు .. కొనుగోలు చేయదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కు ప్రజలు మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. వెంకట్ రెడ్డితో కలిసి తాను ప్రచారం చేస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- ఇంకా ఈ కుల వివక్ష ఏమిటి?… ఇంకెన్నాళ్లు ఈ సామాజిక అస్పృశ్యత???
- మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం