
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్ దిగుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే మునుగోడు బహిరంగ సభ వైపే తెలంగాణ రాజకీయాలు ఫోకస్ అయ్యాయి. బీజేపీ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ముందుగానే రంగంలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా మునుగొండలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండటంతో..వారి మద్దతు తీసుకోవటంలో వేగంగా స్పందించారు.
Read Also : “చే “జారిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్… పత్తాకులేని పార్టీ నేతలు
అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. నేరుగా కమ్యూనిస్టు నేతలతో మాట్లాడిన కేసీఆర్..వారు టీఆర్ఎస్ కు మద్దతిచ్చేలా ఒప్పించారు. మునుగోడు సభకు రావాలని ఆహ్వానించారు. దీంతో..చాడా వెంకటరెడ్డి ఈ రోజు కేసీఆర్ పాల్గొనే మునుగోడు సభకు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ తో పాటుగా ముఖ్యమంత్రి కారులోనే చాడా కూడా మునుగోడుకు వెళ్లనున్నారు. మరో వైపు సీపీఎం కూడా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. బీజేపీని ఓడించేందుకు తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లుగా కమ్యూనిస్టు పార్టీల నేతలు వెల్లడించారు. ప్రగతి భవన్ నుంచి భారీ ర్యాలీగా ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు వెళ్లనున్నారు. రెండు వేల కార్లు ర్యాలీలో ఉండేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేసారు. మధ్నాహ్నం నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ సభ ద్వారా టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్ధిని సీఎం ప్రకటిస్తారా లేదా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
Also Read : మునుగోడులో పోటాపోటిగా తెరాస, భాజప ‘ఆపరేషన్ ఆకర్ష్’… పారేషాన్లో కాంగ్రెస్
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల టీఆర్ఎస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. తరువాత మాత్రమే అభ్యర్ధి ఖరారు పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ రేపు (ఆదివారం) అమిత్ షా సభకు ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు నుంచే టీపీసీసీ చీఫ్ రేవంత్ మునుగోడు కేంద్రంగా మకాం వేస్తున్నారు. పాదయాత్ర చేయనున్నారు. నియోజకవర్గంలో వినూత్న తరహాలో కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎలాగైనా బీజేపీకి గెలుపు అవకాశాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి పట్డుదల తో ఉన్నారు. అదే సమయంలో బీజేపీ సైతం గెలిచి తీరాలని లక్ష్యంతో పని చేస్తోంది. దీంతో..ఈ రోజు రేపు జరిగే బహిరంగ సభల పైన ఆసక్తి నెలకొని ఉంది.
ఇవి కూడా చదవండి :
- తెరాస మెడకు భూ నిర్వాసితుల ఉచ్చు… నష్టపరిహారం చెల్లించాలంటూ ఏడాదిగా నిర్వాసితుల నిరసన దీక్షలు
- ఇంకా ఈ కుల వివక్ష ఏమిటి?… ఇంకెన్నాళ్లు ఈ సామాజిక అస్పృశ్యత???
- మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు