
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు, రానున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న సందర్భంగా మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించనున్నారని పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేయకముందే ముఖ్యమంత్రి ఉపఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. మునుగోడు ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే మునుగోడు పై ఫోకస్ చేశారు.
Read Also : మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
Also Read : ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మునుగోడు ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లను యుద్దప్రాతిపదికన ఉపఎన్నికకు ముందు నెరవేర్చేందుకు నివేదికలు ఇవ్వాలని నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జి. జగదీష్‌రెడ్డిని, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో మునుగోడు ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని నల్గొండ జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, దశాబ్దాలుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదవర్గాలు ప్రభుత్వ కళాశాలలు లేక ప్రైవేటు కళాశాలలో డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నత విద్యను పొందలేకపోతున్నారు అని, ఇక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేక పోతున్నారని ప్రజల ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ప్రతి ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసిన ఏ పార్టీ కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
Read Also : అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
ఆరు పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేరని, ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించిన ఒక్క వైద్యుడే నిర్వహిస్తున్నారని, మిగిలిన ఇద్దరు వైద్యులు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారని నివేదికలో పేర్కొన్నారు. మునుగోడులోని నిరుపేద వర్గాల ప్రజలు ప్రభుత్వ జూనియర్ కళాశాల , డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు నల్గొండ పట్టణం వరకు వెళ్లాల్సి వస్తోందని, రవాణా సదుపాయం లేక తల్లిదండ్రులు విద్యార్థుల చదువుకు స్వస్తి చెప్పాల్సి వస్తోందని వారు సీఎం కేసీఆర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ రేపటి బహిరంగ సభలో ఈ రెండు డిమాండ్లను నెరవేరుస్తామని, అదే రోజు కళాశాలలు, ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన జిఓ విడుదల చేస్తామని నల్గొండ పార్టీ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మరిన్ని వరాల జల్లు కురిపించాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వారు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
- తిరుమలలో మంత్రి రోజా హడావుడి…. ప్రతిపక్షాల తీరుపై మండిపాటు
- తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు?
- సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.