
క్రైమ్ మిర్రర్. ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి, రాష్ట్రంలో మళ్లీ రానున్నది తమ ప్రభుత్వమేనని చాటాలని ఆరాటపడుతున్న తెరాస పార్టీ తమకు డిండి ఎత్తిపోతల పథకం చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల రూపంలో ఎదురుకానున్న అడ్డంకిని ఎలా అధిగమిస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డిండి ఎత్తిపోతల పథకం చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు కోసం వందలాది కుటుంబాలు తమకు జీవనాధారమైన భూములను కోల్పోతున్నాయి. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ ఊసే మర్చిపోయారు.
Read Also : ఇంకా ఈ కుల వివక్ష ఏమిటి?… ఇంకెన్నాళ్లు ఈ సామాజిక అస్పృశ్యత???
దీనితో తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ గత ఏడాది కాలంగా డిండి ఎత్తిపోతల పథకం చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు నిరసన దీక్షను చేపడుతున్నారు. ఒక రైతు అయితే ఏకంగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద కదలిక రాలేదు. దీనితో భూ నిర్వాసిత కుటుంబాలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. అయినా భూనిర్వాసితుల న్యాయం చేసేందుకు అటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఇటు అధికార పార్టీ నేతలు కాదు వారిని కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేసే ప్రయత్నాన్ని కూడా చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ఇక నిన్న మొన్నటి వరకు మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజగోపాల్ రెడ్డి సైతం భూ నిర్వాసితుల పక్షాన పోరాటం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేయలేదు కానీ, తన శాసన సభ్యత్వానికి రాజీనామాతో, వారి వద్దకే అధికార పార్టీ నేతలు దిగి వచ్చేలా మాత్రం చేయగలిగారన్నది నిర్వివాదాంశం.
Also Read : “చే “జారిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్… పత్తాకులేని పార్టీ నేతలు
సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
చర్లగూడెం౼ కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితుల దీక్ష లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి , వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…
తక్షణమే భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ లో ఇచ్చిన విదంగా చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. తన రాజీనామాతో ప్రభుత్వం దిగివచ్చి భూ నిర్వాసితులకు న్యాయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు,మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్, సర్పంచులు , ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడులో పోటాపోటిగా తెరాస, భాజప ‘ఆపరేషన్ ఆకర్ష్’… పారేషాన్లో కాంగ్రెస్
- రేపు మునుగోడులో ముఖ్యమంత్రి భాహిరంగసభ… సభలో కేసీఆర్ వరాల జల్లు, కీలక ప్రకటనలు ??
- మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి
2 Comments