
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ క్యాడర్ “చే”జారిపోతున్నారు. క్యాడర్ ను కట్టడి చేసే నాయకుడే కరువైపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో టికెట్ నాకంటే నాకంటున్న నేతలు, చేజారి పోతున్న పార్టీ శ్రేణులను నిలువరించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ నేతలు, మరొకవైపు బిజెపి నేతల అప రేషన్ ఆకర్ష్ మంత్రానికి కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. గ్రామస్థాయి నాయకులు నుంచి మొదలుకొని, మండల స్థాయి నేత వరకు ఒక్కొక్కరికి ఒక ధర నిర్ణయించి అంగట్లో సరుకుల మాదిరిగా ఆటు టిఆర్ఎస్, ఇటు బిజెపి నేతలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ వంటి ప్రజా ప్రతినిధులకైతే ఐదు నుంచి పది లక్షల రూపాయలు ముట్టజెప్పి పార్టీ కండువాలను కప్పుతున్నారని కొంతమంది నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
Read Also : మునుగోడులో పోటాపోటిగా తెరాస, భాజప ‘ఆపరేషన్ ఆకర్ష్’… పారేషాన్లో కాంగ్రెస్
ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ శ్రేణులను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ కాగా, బిజెపి నేతలు మాత్రం, టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు కండువాలను కప్పే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు తొలుత రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీ మారేందుకు నిరాకరించినప్పటికీ, చివరకు పార్టీలోని గ్రూపు తగాదాలకు వేగలేక కాంగ్రెస్ ను వీడి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఇలా ఒక్క నారాయణపురం లోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు పెద్దదిక్కున్న నాయకుడు లేరన్న ఉద్దేశంతో పార్టీని వీడేందుకు సిద్ధపడుతుండగా, నియోజకవర్గస్థాయి నాయకులు మాత్రం క్యాడర్ ను కాపాడుకోవడంలో ఎందుకనో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైతే, ఆ పార్టీ ఈ పరాజయం నుంచి కోలుకోవడం అంతా ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదన్న విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. అయినా అన్నీ తెలిసి, ఏమిటి నిర్లక్ష్యం అంటే.. అది కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- రేపు మునుగోడులో ముఖ్యమంత్రి భాహిరంగసభ… సభలో కేసీఆర్ వరాల జల్లు, కీలక ప్రకటనలు ??
- మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
One Comment