
క్రైమ్ మిర్రర్ నిఘా ప్రతినిధి : భారత దేశం స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణం ఒకవైపు, మరోవైపు ఈ కుల వివక్ష, సామాజిక అస్పృశ్యత ఏమిటని ప్రశ్నించారు బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్. శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ లో అగ్రకుల అహంకారానికి దళిత విద్యార్థి ‘ఇంద్ర కుమార్ మేఘవాల్’ బలి కావడం… ఈ దేశంలోని ఇంకా సామాజిక అస్పృశ్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు.
Read Also : “చే “జారిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్… పత్తాకులేని పార్టీ నేతలు
టీచర్ తాను తాగడానికి ఉంచిన మంచి నీటి కుండలో “ఇంద్రకుమార్ మేఘవాల్” అనే 9 సంవత్సరాల దళిత విద్యార్థి నీళ్ళు తాగినందుకు ఆ విద్యార్థిని కులోన్మాధ టీచర్ విచక్షణా రహితంగా కొట్టడం వల్ల ఆ విద్యార్థి కను గుడ్లు ఉబ్బిపోయి, శరీరం చచ్చుబడి పోయి, ఏముకలు విరిగి చికిత్స పొందుతూ మరణించడం జరిగిందన్నారు. ఆ విద్యార్థి మరణానికి కారణమైన కులోన్మాధి టీచర్ ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడులో పోటాపోటిగా తెరాస, భాజప ‘ఆపరేషన్ ఆకర్ష్’… పారేషాన్లో కాంగ్రెస్
- రేపు మునుగోడులో ముఖ్యమంత్రి భాహిరంగసభ… సభలో కేసీఆర్ వరాల జల్లు, కీలక ప్రకటనలు ??
- మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు