
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన వాగ్దానాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాగఠ్ బంధన్ ప్రభుత్వం రాబోయే రెండు సంవత్సరాల్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను ప్రచారం ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ”జన్ సురాజ్ అభియాన్” ను ఉపసంహరించుకొని నితీష్ కు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానన్నారు.
Read Also : తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు?
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తేజస్వీ యాదవ్ లాంటి యువతరం నేతల సహకారంతో ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నట్లు నితీష్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే పీకే తాజాగా స్పందించారు. ఆ ఉద్యోగాలు కనుక కల్పిస్తే తన యాత్రను ఉపసంహరించుకుంటానని, సర్కారుకు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు. బీహార్ రాజకీయాల్లోకి వచ్చి తాను కేవలం మూడునెలలే అవుతోందని, కానీ స్వల్పకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సంచలనాలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై పీకే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ ప్రయాసపడుతోంటే నితీష్ కుమార్ మాత్రం ఫెవికాల్ వేసుకొని మరీ ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
Also Read : హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
పీకే గతంలో జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. కొన్ని కారణాలవల్ల పార్టీ ఆయనపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ కూడా ఆయనకు స్వాగతం పలికింది. కానీ ఆ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించారు. బీహార్ రాజకీయాలపై దృష్టిసారించి ”జన్ సురాజ్ అభియాన్” పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాపత్ంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…
One Comment