
క్రైమ్ మిర్రర్, అమరావతి డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. కలియుగ దైవంగా భావించే.. తిరుమల కొండ పై కొందరు మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దుమారం రేపుతోంది. ఇవాళ తన అనుచురులతో కలిసి ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రి రోజాతో పాటు పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉంది. ఆమె వెంట 30 మంది అనుచరులు ఆలయంలోకి వెళ్లారు.. కానీ 20 మందికి అనుమతి లేదని సిబ్బంది చెప్పినా.. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరో 20 మందికి బ్రేక్ దర్శనం కల్పించారు.
అంతేకాదు ఆ 20 మంది దర్శనం పూర్తైనంత వరకు.. అంటే దాదాపు 2 గంటలపైగా ఆమె అక్కడే వేచి ఉండడం ఇప్పుడు విదాస్పదమవుతోంది. భక్తుల రద్దీ మేరకు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలను సైతం ఆపేశారు. అయినా ఆ నిబంధనలను బ్రేక్ చేసి.. అందనంగా మరో 20 మంది అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించారు రోజా.. దీంతో మంత్రి తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Read Also : కన్న పిల్లలను గొంతు కోసి చంపిన కసాయి తండ్రి
ఇలా తిరుమలలో మంత్రులు వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల మరో మంత్రి ఉషా శ్రీ చరణ్ అనుచరులైతే పెను దుమారమే రేపారు. అది కూడా మంత్రి సమక్షంలోనే.. దాదాపు 50మంది అనుచరులతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. మరో పదిమంది అనుచరులు సుప్రభాతం టికెట్లను పొందారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో దీనిపైనే వివాదం నడిచింది. అయితే ఉషా శ్రీ చరణ్ అనుచరులు.. మంత్రి ఎదురుగానే మీడియా ప్రతినిధులపై దాడి చేయడం.. భక్తులతో ఘర్షణకు దిగడం.. దుమారం రేపింది. ఆ వివాదం మరిచిపోకముందే.. ఇప్పుడు రోజా తీరు సైతం విమర్శల పాలైంది. ఆమె తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Also Read : ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
వివాదం పక్కన పెడితే.. స్వామివారి దర్శనం పూర్తైన తరువాత మాట్లాడిన రోజా.. ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి కి అపోజిషన్ హోదా కూడా రాదన్నారు. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు.. మంగళిగిరిలో లోకేష్ లు సైతం ఘోరంగా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం. మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ప్రజల్లో ఆదరణ పెరుగతోంది అన్నారు.
పారదర్శక పాలనా సాగిస్తున్నాం కాబట్టే.. సర్వే ఏదైనా వైసిపి దే మళ్లీ అధికారం అని చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఏ పరిశ్రమ ప్రారంభించినా.. అవి మేమే తెచ్చామని తెలుగు దేశం నేతలు డబ్బాలు కొట్టుకోవడం ఆపాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు చూసి కంపెనీలు పారిపోతున్నాయని మొన్నటి వరకు విమర్శలు చేసిన విపక్షాలు.. ఇప్పుడు అంతా మేమే చేశామనడం విడ్డూరంగా ఉంది అంటూ మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని గత మూడేళ్లలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనత జగన్ దే అన్నారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
- బీహార్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్….
- తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు?
- సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు