
క్రైమ్ మిర్రర్, ఖమ్మం : తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న 8 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
నిందితుల్లో ఏ2గా రంజాన్, గంజి స్వామి (ఏ4), నూకల లింగయ్య (ఏ5), బోడపట్ల శ్రీను (ఏ6), నాగేశ్వరరావు (ఏ7), నాగయ్య (ఏ8)గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి పోలీసుల పహారాలో ఉంది. గ్రామంలోని కూడళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి పహారా కాస్తున్నారు. 12 చోట్ల మొత్తం 92 మంది పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
Also Read : సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.
12 మంది ఎస్‌ఐలు, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్ కొనసాగుతోంది. మండల వ్యాప్తంగా ఈనెల 18వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ విష్ణు ఎస్.వారియర్ ప్రకటించారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య హత్య నేపథ్యంలో కృష్ణయ్య అనుచరులు, గ్రామస్థులు గ్రామంలోని తమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరి ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిపై నిఘా పెట్టారు. గ్రామస్థులు, ముఖ్యంగా కృష్ణయ్య అనుచరుల కదలికలపై పోలీసులు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
- హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…