
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబులో సడన్ ఛేంజ్. చంద్రబాబు ముందు పార్టీలో..బయటా ఎవరూ హద్దులు దాటలేరు. చొరవ తీసుకొని మాట్లాడలేరు. తొలి నుంచి ప్రతీ చోటా అదే “పట్టు” తో నెట్టుకొచ్చారు. అటువంటి చంద్రబాబు లో ఒక్క సారిగా మార్పు కనిపించింది. ఆ మార్పు నిత్యం ఆయనతో ఉండే వారే ఊహించలేకపోయారు.తమ అధినేతతో తమతో మమేకం అవ్వటం తో వారి సంతోషానికి హద్దులు లేవు. ఇటువంటి అరుదైన సందర్భానికి చంద్రబాబు నివాసం వేదికైంది.
Read Also : హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేసారు. అది మూములు భోజనం కాదు. 449 రకాలతో ఏర్పాటు చేసిన విందు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే అటెండర్ నుంచి మేనేజర్ వరకూ, సెక్యూరిటీ గార్డు నుంచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకూ, హౌస్ కీపింగ్ సిబ్బంది నుంచి కార్యాలయ కార్యదర్శి వరకూ అందరినీ ఈ విందుకు ఆహ్వానించారు. ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారితో కలిసి తాను విందులో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కిరినీ పేరుతో పిలచి.. వారితో కలిసి ఫొటోలు దిగారు.
Also Read : అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
అందరి భోజనాలు అయ్యే దాకా వారి మధ్యనే ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను వారి వాట్సప్ కు పంపాలంటూ సిబ్బందికి సూచించారు. చంద్రబాబు వచ్చారంటేనే సైలెంట్ అయిపోయి..వారి పనుల్లో నిమగ్నమయ్యే సిబ్బంది.. తమ అధినేత ఒక్క సారిగా తమ మధ్యకే రావటం ఒక స్వీట్ మెమోరీగా చెప్పుకున్నారు. అందునా.. స్వయంగా వారితో కలిసి భోజనం చేయటం.. వారిని ఆప్యాయంగా పలకరించటంతో అ సమయం వారికి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎప్పుడూ అంత గంభీరంగా కనిపిస్తూ…నిత్యం సమావేశాల్లో ఉండే చంద్రబాబు.. ఇలా భిన్నంగా తమతో కలిసి పోవటం.. తమ సమయం కేటాయించటంతో వారి ఆనందానికి హద్దులు లేవు. హౌస్ కీపింగ్ సిబ్బందిని పలకరిస్తూ చంద్రబాబు భోజనం చేశారా అని అడుగుతుంటే..వారంతా చాలా గొప్పగా ఫీలయ్యారు. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు చూసుకుంటూ మురిసిపోయారు. ఇప్పుడు ఈ అరుదైన డిన్నర్..టీడీపీలో ఆసక్తికర చర్చగా మారింది.
ఇవి కూడా చదవండి :
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…
- మునుగోడులో కారు పంక్చరే! బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీపీ.. అదేబాటలో వందిమందికి పైగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి