
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుండే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి రియాల్టీ, వాసవి ఫిడిల్ వెంచర్స్, వాసవి నిర్మాన్, ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఇన్‌కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు వెల్లువెత్తాయి.
Read More : అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద వెంచర్లు ఏర్పాటు చేసి కస్టమర్ల నుంచి వేల కోట్లలో డబ్బులు దండుకుంటున్న వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్.. ఆ ఆదాయంపై ఆదాయ పన్ను చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆదాయ పన్ను శాఖ అధికారులు గ్రహించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలు, యజమాని, సంస్థతో సంబంధం ఉన్న వారి నివాసాల్లోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం అందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి స్పష్టమైన సమాచారం సేకరించిన అనంతరమే మరిన్ని ఇతర ఆధారాల కోసం ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.
Read More : తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
మరో రియల్ ఎస్టేట్ కంపెనీ సుముధరపైనా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్, బెంగళూరులలో తనిఖీలు కొనసాగాయి. వాసవి, సుముధర కలిసి భారీ వెంచర్లు వేశారు. టాలెస్ట్ టవర్ పేరుతో భారీగా వ్యాపారం చేసింది సుముధర. మునుగోడు ఉప ఎన్నిక వేళ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి
- రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన….
- మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు… ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ
- తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా….
3 Comments