
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తాను ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లు అయినా నియోజకవర్గానికి నేనేమి చేయలేదు… కేసీఆర్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడం వల్లే నేను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాను… తాను రాజీనామా చేస్తేనే మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తాయంటే తాను పదవి వదులుకోవడానికి సిద్దం… ఇది గత ఏడాదిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట… గత ఏడాది ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికతో హుజురాబాద్ దశ మారిపోయింది. నెల రోజుల్లోనే ప్రభుత్వం వేలకోట్ల రూపాయుల ఖర్చు చేసింది. నియోజకవర్గంలోని రోడ్ల్నని అద్దాల్లా తయారయ్యాయి. హుజురాబాద్ ను గుర్తు చేస్తూ మునుగోడులో కూడా అలా అభివృద్ధి జరగాలంటే ఉప ఎన్నిక వస్తేనే సాధ్యమంటూ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.
Read More : రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన….
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి 10 రోజులైంది. ఆయన అన్నట్లుగానే మునుగోడులో సీన్ కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయాయి. చౌటుప్పల్- నారాయణ పురం ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారై ఏళ్లు కావస్తొంది. గుంతల రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వాహనదారులు నరకం చూశారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. రోడ్డును రిపేర్ చేసిన పాపానికి పోలేదు. కాని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వం కదిలిపోయింది. చౌటుప్పల్- నారాయణ పురం రోడ్డుకు మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. దీంతో ఉప ఎన్నిక పుణ్యానే రోడ్డు బాగవుతుందని ప్రజలు, వాహనదారులు చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే తమకు నరకం తప్పేది కాదని వాహనదారులు అంటున్నారు.
Read More : తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా….
రోడ్లే కాదు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్లకు మోక్షం కల్గింది. కొత్త పెన్షన్ దారులకు కార్డులను చౌటుప్పల్, నారాయణపురంలో అందించారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడుకు ఉప ఎన్నిక రాకుంటే కొత్త పెన్షన్లు కూడా వచ్చేవి కావంటున్నారు. కొత్తగా పెన్షన్లు తీసుకున్న లబ్దిదారులు కూడా రాజగోపాల్ రెడ్డికై జై అంటున్నారు. ఇవే కాదు నియోజకవర్గంలోని రోడ్లు మొత్తం అద్దాల్లా మెరిసేలా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారని తెలుస్తోంది. గ్రామాల్లోని సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తున్నారట. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఎంపీటీసీలకు 20 నుంచి 30 లక్షల వరకు నిధులు ఇస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారని అంటున్నారు. కమ్యూనిటీ హాల్స్, మహిళా సంఘాలకు భవనాలు మంజూరు చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు దశ మారుతుందని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లే తమ సమస్యలు తీరుతున్నాయని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…
- మునుగోడులో కారు పంక్చరే! బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీపీ.. అదేబాటలో వందమందికి పైగా
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి
2 Comments