
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతదేశానికి స్వతంత్రం సిద్దించి 75సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభతరుణంలో తెలంగాణ ప్రభుత్వం 15రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఆబిడ్స్‌జీపీవో సర్కిల్‌లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఎంపీ కేకే పాల్గొన్నారు. ఈ మేరకు ఆబిడ్స్, నెక్లెస్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ని కొంత సమయం నియంత్రించి ఈకార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.
Also Read : మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు… ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన సరిగ్గా ఆగస్ట్ 16వ తేది నాడు 11.30 నిర్వహించారు. ఈకార్యక్రమంలో కుల,మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు, మెట్రో రైల్ స్టేషన్‌లలో ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించించారు.
Read Also : తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా….
75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆగస్ట్ 8న ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 22 వరకు వజ్రమహోత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రధాన కూడళ్లు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు,అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ సభ రోజే మునుగోడుకు రేవంత్ రెడ్డి.. సమరానికి సై అంటున్న పీసీసీ చీఫ్
- కారెక్కుతున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు.. మునుగోడులో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
- బుద్ధ మహా సమ్మేళనం, రానున్న మినిస్టర్లు….
- బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత….
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు కాంగ్రెస్ నేతల్లో కలవరం
One Comment